ఎంపీ లావుపై మాజీ మంత్రి విడదల సంచలన కామెంట్స్‌.. ఏమన్నారంటే.?

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విడదల రజనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై ఆమె కీలక ఆరోపణలు చేశారు. తాజాగా ఆమెపై కేసులు నమోదవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనపై అక్రమ కేసులు పెట్టించారని, ఇందులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా తన మీద అక్రమ కేసులు పెట్టించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని, తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Former Minister Rajani

విడదల రజనీ

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విడదల రజనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై ఆమె కీలక ఆరోపణలు చేశారు. తాజాగా ఆమెపై కేసులు నమోదవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనపై అక్రమ కేసులు పెట్టించారని, ఇందులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా తన మీద అక్రమ కేసులు పెట్టించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని, తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫాలో అప్‌ మొత్తం తాను చూసుకుంటాను అంటూ నమ్మబలికారని, తరువాత తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. కృష్ణదేవరాయలు గతం నుంచే తనపై ద్వేయంతో వ్యవహరిస్తున్నారని, 2020లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్‌ స్టేషన్‌లో తమ అధికారాన్ని తమపైనే ప్రయోగించారని ఆరోపించారు.

రజనీ తనపై జరిగిన పోలీస్‌ దుర్వినియోగాన్ని వివరిస్తూ ఫోన్‌ కాల్‌ డేటాను తీసే ప్రయత్నం చేశారు. ఒక ఎంపీ, ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాల్‌ డేటా తీసే హక్కు ఎవరికి ఉందని, ఇంట్లో ఆడవాళ్ల కాల్‌ డేటా తీస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడరా.? అని ప్రశ్నించారు. ఈ విషయాల్లో అప్పట్లోనే వైఎస్‌ జగన్‌కు తాను చెప్పానని, ఆయన పోలీసులను ప్రశ్నించగా వారు కృష్ణదేవరాయలే చెప్పారని ఒప్పుకున్నారన్నారు. కాల్‌ డేటా వ్యవహారంపై ఆధారాలు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని హెచ్చరించారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, తన కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. జర్మనీలో ఉన్న మా మరిదిపై కేసు పెట్టించారన్నారు. మార్గంలో కార్లు పగులగొట్టారని, అక్రమ కేసులు పెట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా రాజకీయ కుట్ర అని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. తన కళ్లల్లో భయం చూద్దామనే కుట్రలు చేస్తున్నారని, కానీ తాను భయపడనని స్పష్టం చేశారు. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమన్నారు. తనకు రత్తయ్య గారంటే గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు మాత్రం తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ధర్నా చేస్తే తమపై కేసులు పెట్టించారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. కానీ, ఈ రాజకీయ దాడులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్