టిడిపిలోకి రీఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి బాబు మోహన్.. తెలంగాణలో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్

ప్రముఖ సినీనటుడు, మాజీమంత్రి బాబు మోహన్ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన ఆయన బిఆర్ఎస్, బిజెపి, ప్రజాశాంతి పార్టీలో చేరిన ఆయన రాజకీయంగా స్థిరత్వాన్ని సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో మళ్లీ చేరారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.

Babu Mohan joined TDP

టిడిపి సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్

ప్రముఖ సినీనటుడు, మాజీమంత్రి బాబు మోహన్ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన ఆయన బిఆర్ఎస్, బిజెపి, ప్రజాశాంతి పార్టీలో చేరిన ఆయన రాజకీయంగా స్థిరత్వాన్ని సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో మళ్లీ చేరారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వాన్ని తీసుకున్న ఫోటోను ఆయన విడుదల చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు మోహన్ సీఎం చంద్రబాబు నాయుడును వెళ్లి కలిశారు. వీరిద్దరి కలయిక తర్వాత బాబు మోహన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చంద్రబాబుతో కలయిక తర్వాత తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీలో మళ్లీ చేరుతానంటూ పేర్కొన్నారు. అయితే కొద్ది నెలలు గ్యాప్ తీసుకున్న బాబు మోహన్ తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వం తీసుకున్న ఫోటోను ప్రస్తుతం ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణకు చెందిన కీలక నేతలతో ఇప్పటికే పలుదపాలుగా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే మళ్లీ పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా

 పనిచేసిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే బాబు మోహన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరిన బాబు మోహన్ కు కీలక బాధ్యతలను అప్పగించేందుకు చంద్రబాబునాయుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక పదవిని బాబు మోహన్ కు ఆయన అప్పగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బాబు మోహన్ అనేక బాధ్యతలను నిర్వర్తించారు. తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో ఆందోల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో ఆందోల్ నుంచి మళ్లీ టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను వరుసగా ఓటములు పలుకరిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర యువజన తర్వాత మాత్రం 2014 లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ విజయం సాధించారు. టిఆర్ఎస్ పార్టీ పలు కారణాల వల్ల 2018లో జరిగిన ఎన్నికల్లో బాబు మోహన్ కు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 లో కూడా బిజెపి నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఫిబ్రవరిలో బిజెపికి రాజీనామా చేసిన బాబు మోహన్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. అనంతరం వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలి భావించిన కుదరంచకపోవడంతో తాజాగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టిడిపిలో ఆయనకు ఎటువంటి బాధ్యతలను అప్పగిస్తారని దానిని బట్టి ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్