బలవన్మరణ భారత్.. ఆత్మహత్యల్లో అగ్రగామిగా నిలిచిన ఇండియా

భారతదేశం ఆత్మహత్యల కేంద్రంగా మారుతోంది. ఏటా లక్షలాది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మార్కులు రాలేదనో, సరైన ఉద్యోగం దొరకలేదనో, తల్లిదండ్రులు మందలించారనో, ఆర్థిక ఇబ్బందులతోనో, వ్యవసాయ సంబంధిత సమస్యలతోనో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) ఏప్రిల్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.

suicide

 ఆత్మహత్య

భారతదేశం ఆత్మహత్యల కేంద్రంగా మారుతోంది. ఏటా లక్షలాది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మార్కులు రాలేదనో, సరైన ఉద్యోగం దొరకలేదనో, తల్లిదండ్రులు మందలించారనో, ఆర్థిక ఇబ్బందులతోనో, వ్యవసాయ సంబంధిత సమస్యలతోనో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) ఏప్రిల్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్షకు 12.4 మందికి పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్న అంశాలు ఏమిటి అనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైంది. అయితే, మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణమని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరిలో జన్యుపరమైన కారణాలు, కొన్ని రకాల ఒత్తిళ్లు వల్ల ప్రేరేపితమవుతున్న మానసిక అనారోగ్యంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 'ఆత్మహత్యకు అత్యంత సాధారణ కారణం డిప్రెషన్. దీన్నే మేము ఒత్తిడి అని పిలుస్తాం. వెంటాడుతున్న సమస్యల వల్ల ఒత్తిడికి గురి కావచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా, క్షణికావేశంలోనూ ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కువ శాతం కేసుల్లో ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటుంది' అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ ఒత్తిళ్లకు పని, ఆర్థికపరమైన మానవ సంబంధాలు, ఆరోగ్యపరమైన సమస్యలు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. ఒత్తిడి తీవ్రమైనప్పుడు అది డిప్రెషన్ గా మారి ఆత్మహత్యకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో 50 నుంచి 90% మంది నిరాశ, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో బాధపడిన వారేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఆత్మహత్యలను సామాజిక సమస్యగా అభివర్ణించిన సుప్రీంకోర్టు 

భారతదేశంలో ఆందోళనకర రీతిలో ఆత్మహత్యలు పెరగడం పట్ల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. భారత్ లో ఆత్మహత్యలు పెరగడాన్ని సుప్రీంకోర్టు సామాజిక సమస్యగా అభివర్ణించింది. ఆత్మహత్యలను నివారించడానికి ప్రజారోగ్య కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ పై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్పందించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రాన్ని ఆదేశించింది. పెరుగుతున్న ఆత్మహత్యలను ఎదుర్కోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమని న్యాయవాది పిటిషనర్ గౌరవ కుమార్ బన్సాల్ చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్