రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు కీలకమైన హామీని అమలు చేయబోతున్నారు. మహిళలకు ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని అప్పట్లో కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ హామీని దీపావళి పండగ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులు పూర్తి చేసింది. అందులో భాగంగానే మంగళవారం నుంచి గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు.
గ్యాస్, సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు కీలకమైన హామీని అమలు చేయబోతున్నారు. మహిళలకు ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని అప్పట్లో కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ హామీని దీపావళి పండగ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులు పూర్తి చేసింది. అందులో భాగంగానే మంగళవారం నుంచి గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,684.75 కోట్ల రాయితీ భారం భరించనుంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జంప్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలి విడత వంట గ్యాస్ సిలిండర్లను పొందే లబ్ధిదారులకు చెల్లించాల్సిన రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం డేటాబేస్ ఆధారంగా 24 గంటల్లోపు ఆయా గ్యాస్ కంపెనీలు లబ్ధిదారుల ఆధార్ లింకుతో కూడిన బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని జమ చేస్తాయి.
ప్రస్తుతం మార్కెట్ ధర రూ.876 కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అది పోగా మిగిలిన రూ.851 పూర్తి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించనుంది. దీపావళి నుంచి ప్రారంభించే తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లను వచ్చే ఏడాదిగా మార్చి వరకు కొనసాగించనున్నారు. తరువాత నుంచి నాలుగు నెలలకు ఒకటి చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో మొత్తంగా 1,55,84,270 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1.48 కోట్ల మందికిపైగా తెల్ల కార్డుదారులు ఉన్నారు. వీరంతా ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులే. వీరందరికీ ప్రభుత్వం తాజాగా ఈ పథకంలో భాగంగా లబ్ధిని చేకూర్చనుంది. కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి బుకింగ్ సదుపాయం కల్పించడంతో వేలాదిమంది లబ్ధిదారులు ఈ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.