రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ తో ఫుడ్ ఆర్డర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు వాట్సప్ నుండి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వలన ప్యాసింజర్లు తమ స్థానంలో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ని తమ వద్దకి క్యాటరింగ్ సర్వీస్ పొందవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.. 

ఈ ఫుడ్ ఆర్డర్ ప్రాసెస్ ని రెండు విధాలుగా చేసుకోవచ్చు. 

1) వాట్సాప్ కమ్యూనికేషన్‌ సర్వీస్‌లకు 8750001323 ను ఉపయోగించుకుని ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.  దీనికోసం టికెట్స్ బుక్ చేసిన నెంబర్‌కు బిజినెస్‌ వాట్సాప్ నెంబర్‌ ఒక మెసేజ్ వస్తుంది. అందులోని ఆప్షన్లను ఎంపిక చేస్తూ కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేస్తే ఐఆర్‌సీటీసీ ఈ ఆహారాన్ని అందిస్తుంది. 

 2) ఈ-టికెట్‌ బుక్‌ చేసుకోగానే  www.ecatering.irctc.co.in లింకుతో కూడిన వాట్సాప్‌ మెసేజ్‌ వస్తుంది. ఈ లింకును క్లిక్ చేయడం ద్వారా రైలులో వెళ్లే మార్గంలో నీ రెస్టారెంట్ల నుంచి ఆహారం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సదుపాయం కొన్ని రైళ్ళల్లోనే ఈ-క్యాటరింగ్ వాట్సప్ కమ్యూనికేషన్ సర్వీస్ లను ప్రారంభించారు. ఈ-క్యాటరింగ్ సర్వీస్ ద్వారా ప్రస్తుతం రోజుకు 50 వేలకు మీల్స్ అందిస్తున్నారు. అయితే దీనిని ముందు ముందు చాట్ బోర్డ్ సర్వీస్ లను తీసుకురానున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్