ఇండియా కూటమిలో లుకలుకలు.. ఢిల్లీ ఎన్నికల్లో విడిగా బరిలోకి ఆప్, కాంగ్రెస్ పార్టీ

ఆప్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కొద్దిరోజుల కిందట జరిగిన హర్యానా ఎన్నికల్లోను ఆప్, కాంగ్రెస్ పార్టీ విడిగానే పోటీ చేశాయి. అక్కడ దారుణమైన ఫలితాలను ఆప్ చవిచూసింది. అయినప్పటికీ ఢిల్లీలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అనుసరించేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రేవాల్ నిర్ణయం తీసుకున్నారు.

Arvind Kejriwal and Rahul Gandhi

అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ

దేశ వ్యాప్తంగా లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమిగా అనేక ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించడంలో విఫలమైంది. దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఇండియా కూటమిగా జతకట్టిన పార్టీలు ఒక్కొక్కటిగా మళ్లీ విడిపోతున్నాయి. ఈ మేరకు ఆప్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కొద్దిరోజుల కిందట జరిగిన హర్యానా ఎన్నికల్లోను ఆప్, కాంగ్రెస్ పార్టీ విడిగానే పోటీ చేశాయి. అక్కడ దారుణమైన ఫలితాలను ఆప్ చవిచూసింది. అయినప్పటికీ ఢిల్లీలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అనుసరించేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రేవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. మొత్తం స్థానాలను బిజెపి దక్కించుకుంది. తాజాగా జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆప్ మధ్య పొత్తు కుదరకపోవడంతో విడివిడిగానే పోటీ చేశాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లోను ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు కేజ్రేవాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆప్ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి కూడా అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో లభించిన విజయంతో మంచి ఊపు మీద ఉన్న బిజెపి ఢిల్లీ పీఠాన్ని కూడా దక్కించుకోవాలని చూస్తోంది. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ కీలక నేత అమిత్ షా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా ఢిల్లీలో అధికారంలోకి రావచ్చని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో ఆప్, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేయడం కూడా తమకు కలిసి వస్తుందని బిజెపి అగ్రనాయకత్వం ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పట్ల బిజెపి నాయకత్వం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, మరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వంటి కీలక పరిణామాల తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ ప్రజలు ఎవరు వైపు ఉంటారో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఈ క్రమంలోనే ఒంటరి పోరు దిశగా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆప్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ తో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందో, లేక ఒంటరిగానే పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుందో చూడాల్సి ఉంది. వరుస ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒక అడుగు వెనక్కి తగ్గి ఆప్ తో పొత్తు పెట్టుకుంటుందో, లేక ఒంటరిగానే బరిలోకి దిగి తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తుందో చూడాల్సి ఉంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్