ప్రతిరోజూ పిడికెడు అవిసె గింజలు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవిసె గింజలను ప్లాక్ సీడ్స్ అని కూడా చెబుతంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3, ఒమేగా-6, థాయమిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
అవిసె గింజలు
ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారపు అలవాటు ఎంత ముఖ్యమే. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాల్సిన వాటిలో తప్పనిసరిగా అవిసె గింజలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలను తింటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. ప్రతిరోజూ పిడికెడు అవిసె గింజలు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవిసె గింజలను ప్లాక్ సీడ్స్ అని కూడా చెబుతంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3, ఒమేగా-6, థాయమిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేస్తుంది. ఐరన్ ఎర్ర రక్త కణాలను సమృద్ధిగా ఉంచుతుంది. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కరిగే, కరగని ఫైబర్ ఇందులో అధికంగా ఉంటుంది. ఇందులోని కరిగే ఫైబర్ హృదయనాళ పనితీరును నిర్వహించడానికి సహాయం చేస్తుంది. కరగని ఫైబర్ చెడు కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మంచి పాత్ర పోషిస్తుంది. అవిసె గింజల్లో ఉండే పైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి కేన్సర్‌తో పోరాడతాయి. ఇందులోని లిగ్నాన్స్ శరీరంలోని రసాయనాల ద్వారా జీవక్రియ చేయబడి శరీరంలోని హార్మోన్లను సమత్యులం చేస్తుంది. ఈ వితనాల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రొమ్ము, ప్రొస్టేట్, పెద్ద పేగు కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. రక్తంలోని షుగర్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఈ గింజులు దోహదం చేస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థాం ఎక్కువ సేపు ఆకలిగా అనిపించకుండా చేయడం ద్వారా అతిగా తినకుండా, శరీరంలో క్యాలరీలు పరిమాణాన్ని పెంచకుండా ఉంచుతుంది. ఈ గింజల్లో 95 శాతం ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అవిసె గింజల్లో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అవిసె గింజల్లో ఒమేగా-3, విటమిన్-ఈ ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి.