హైదరాబాదు నగర పరిధి పాతబస్తీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పి వేసే ప్రయత్నం చేశారు. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక బిల్డింగ్ సెల్లార్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం కాస్త పైపులకు పాకింది.
ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాదు నగర పరిధి పాతబస్తీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పి వేసే ప్రయత్నం చేశారు. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక బిల్డింగ్ సెల్లార్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం కాస్త పైపులకు పాకింది. దీంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం వల్ల భవనంపై అంతస్తులోనూ దట్టమైన పొగ అలుముకుంది. దీంట్లో ఉన్న కొందరిని కాలా పత్తర్ సీఐ, కిషన్ బాగ్ కార్పొరేటర్, స్థానికులు కిందికి దింపారు. ఘటనా స్థలానికి అగ్నిమాపకు సిబ్బంది చేరుకొని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆస్తి నష్టం పై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.
భాగ్యనగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల నిజాంపేట్ లో అగ్నిప్రమాదం జరిగింది. నిజాంపేట్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్లో గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో మూడు షాపులు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతతో మూడుసార్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం సంభవించింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఒక షాపు నుంచి మరో షాపుకు మంటలు వ్యాపిస్తుండడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అప్పుడు కూడా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడగలరు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నదానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. సెల్లార్ లో అగ్ని ప్రమాదం జరగడంతో పెద్దగా నష్టం సంభవించలేదని తెలుస్తోంది.