మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం.. గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ కుంభమేళాలోని ఒక శిబిరంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా మంటలు వ్యాప్తి చెందాయి. ఎగసిపడిన మంటలను చూసిన భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. మహా కుంభమేళా అత్యంత వైభవంగా ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. 40 రోజులపాటు జరగనున్న కుంభమేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసింది.

Flaming firecrackers

ఎగిసిపడుతున్న అగ్నికీలలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ కుంభమేళాలోని ఒక శిబిరంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా మంటలు వ్యాప్తి చెందాయి. ఎగసిపడిన మంటలను చూసిన భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. మహా కుంభమేళా అత్యంత వైభవంగా ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. 40 రోజులపాటు జరగనున్న కుంభమేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. అయితే, అనూహ్యంగా ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్‌19 క్యాంప్‌ సైట్‌ ప్రాంతంలో రెండు, మూడు సిలిండర్లు పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా వేదిక వద్ద అప్పటికే ఉంచిన సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సహాయ చర్యలను చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేవారు. స్థానిక అధికారులు, అగ్నిమాపకశాఖ అధికారులు సమన్వయంతో మంటలను క్షణాల్లోనే ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం వైపు వెళ్లకుండా అధికారులు నిలువరించగలిగారు.

అధికారులు ప్రాథమిక నివేదికలు ప్రకారం క్యాంప్‌ సైట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అనేక గుడారాలను మంటల్ని చుట్టుముట్టాయి. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంలో అగ్ని మాపక సిబ్బందికి సహకారాన్ని అందించాయి. అనేక గుడారాలు ఈ ప్రమాదంలో బూడిదయ్యాయి. చుట్టుపక్కల గుడారాల్లో నివసిస్తున్న ప్రజలను భద్రత కోసం ఖాళీ చేయించినట్టు అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. మహా కుంభమేళాలో 2025 అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఘటనపై పోస్టు చేసింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఈ పోస్టులో కూడా వివరాలను వెల్లడించారు. చాలా విచారకరమని, మహా కుంభ్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురి చేసిందని, పరిపాలన యంత్రాంగం తక్షణ సహాయ, రెస్క్యూ ఆపరేషన్లు అందిస్తోందని ఈ పోస్టులో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం మేము గంగను ప్రార్థిస్తున్నామని పోస్టులో రాసుకొచ్చారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం యోగి ఆధిత్యనాథ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను, అధికారులను అడిగి ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన వారికి సహాయం అందించాలని సీనియర్‌ అధికారులకు ఆయన సూచనలు చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్