ఏపీలో మండుతున్న ఎండలు.. నేడు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ తీవ్ర స్థాయిలో ఎండలో కాస్తున్నాయి. శుక్రవారం ఎండ తీవ్రతతో పాటు అనేక మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తంగా శుక్రవారం ఏపీలోని 84 మండలాల్లో వాడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో 8, కృష్ణాజిల్లాలో ఏడూ, గుంటూరు జిల్లాలో 8, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో వడగోల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ తీవ్ర స్థాయిలో ఎండలో కాస్తున్నాయి. శుక్రవారం ఎండ తీవ్రతతో పాటు అనేక మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తంగా శుక్రవారం ఏపీలోని 84 మండలాల్లో వాడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో 8, కృష్ణాజిల్లాలో ఏడూ, గుంటూరు జిల్లాలో 8, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో వడగోల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. శనివారం కూడా 80 మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

మరోవైపు మార్చి తొలి వారంలోనే ఎండలు మండుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడి గాలులతో పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో మరింత తీవ్రమైన వడ గాల్పులు వీస్తాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని ఏడు మండలాల్లో తీవ్ర వడ గాల్పులు వీచాయి. 68 మండలాల్లో వడ గాల్పులు వీచాయి. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 39.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. భూమిలో తేమ గణనీయంగా తగ్గడం, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వర్షాలు లేకపోవడంతో వేడి రోజుకు పెరుగుతుంది. ఈ ఏడాది సుదీర్ఘ వేసవి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత గాడ్పులు తీవ్రత స్వల్పంగా తగ్గిన వేడి ప్రభావం ఉంటుందన్నారు. ముందుగా వేసవి సీజన్ రావడంతో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధ్యమైనంత వరకు ఎండలో పనులకు విరామం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్