వేసవికాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన రెండు వారాల నుంచి ఎండలు తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎండలు తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిపుణులు కూడా ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మార్చి నెలాఖరు నుంచి, ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరింత దారుణంగా ఎండలు పెరుగుతాయని పేర్కొంటున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
వేసవికాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన రెండు వారాల నుంచి ఎండలు తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎండలు తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిపుణులు కూడా ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మార్చి నెలాఖరు నుంచి, ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరింత దారుణంగా ఎండలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒక్క తెలంగాణలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గింది. దీనివల్ల భూమిలో, గాలిలో ఫేమస్ శాతం తగ్గింది. దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. 125 సంవత్సరాల సరాసరితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 191 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు వడ గాలులు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎండలు తీవ్రత జరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని నిపుణులు చూస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉత్తమమని పేర్కొంటున్నారు. డిహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.