జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులు.. స్వాగతం పలికిన బీఆర్ఎస్, గిరిజన సంఘాల నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లకచర్ల ఘటనకు సంబంధించి కేసులో జైలులో ఉన్న రైతులు శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనకు సంబంధించి 37 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న 17 మంది రైతులు శుక్రవారం ఉదయం నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయటకు వచ్చిన రైతులకు గిరిజన సంఘాలు, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు స్వాగతం పలికారు.

Farmers coming out of jail

జైలు నుంచి బయటకు వస్తున్న రైతులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లకచర్ల ఘటనకు సంబంధించి కేసులో జైలులో ఉన్న రైతులు శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనకు సంబంధించి 37 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న 17 మంది రైతులు శుక్రవారం ఉదయం నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయటకు వచ్చిన రైతులకు గిరిజన సంఘాలు, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు స్వాగతం పలికారు. ఈ కేసులో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వీరంతా గురువారమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. మరోవైపు ఇదే కేసులో ఏ1 గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

నాంపల్లి కోర్టు నరేందర్ రెడ్డికి రెండు పూచీ కత్తులను సమర్పించాలని ఆదేశించింది. రూ.50 వేలు చొప్పున చెల్లించాలని, మూడు నెలల పాటు వారానికి ఒకసారి బొంరాస్ పేట ఎస్హెచ్ఓ ఎదుట హాజరుకావాలని, విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష పూచికత్తు ఇవ్వాలని షరతులు విధించింది. ప్రతివారం పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ తో పాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు. ఈ సందర్భంగా విడుదలైన రైతులు మాట్లాడుతూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్ పై దాడి ఘటనతో తమకు సంబంధం లేదని లగచర్ల రైతులు స్పష్టం చేశారు. తమను అన్యాయంగా అరెస్టు చేశారని వారంతా వాపోయారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి అర్ధరాత్రి ఇళ్లల్లో నుంచి పోలీసులు తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుతెరువు కోసం సౌదీ వెళ్ళేందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఈ కేసుతో రద్దు అయిందని కన్నీరుగా పలువురు రైతులు విలపించారు. ప్రాణాలు పోయినా తమ భూములు ఇవ్వమని, ఇండస్ట్రీ కారిడార్ కు కూడా భూములు ఇవ్వమని రైతులు స్పష్టం చేశారు. 

ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపించలేదు. దీంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఫార్మా కంపెనీ భూ సేకరణ నిమిత్తం మాట్లాడేందుకు గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కలెక్టర్ గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఘటనకు బాధ్యులైన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలోనే సదరు రైతులకు బెయిల్ మంజూరు కావడంతో బయటకు వచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్