రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు ముంపునకు గురై విలవిల్లాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లోని ప్రజలు వరదల వల్ల తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించేందుకు అనేకమంది దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ లో ఎన్టీఆర్ పోస్టు పెట్టారు.
జూనియర్ ఎన్టీఆర్
రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు ముంపునకు గురై విలవిల్లాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లోని ప్రజలు వరదల వల్ల తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించేందుకు అనేకమంది దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ లో ఎన్టీఆర్ పోస్టు పెట్టారు. రెండు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేచిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయ పడాలని తనవంతుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రిల సహాయ నిధికి చేరో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వరదలకు సంబంధించి ప్రజలను ఆదుకునేందుకు స్పందించిన తొలి నటుడిగా ఎన్టీఆర్ నిలిచారు. భారీ విరాళం ప్రకటించడంతో ఆయన బాటలోనే మరి కొంతమంది టాలీవుడ్ నట్లు పైనుంచి అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనూ అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రభుత్వాలకు విరారాలను అందించారు. తన అభిమానులు చేయూత అందించాలని గతంలోనే ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తుల సమయం వచ్చినప్పుడు ప్రజలకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ఎల్లప్పుడూ ముందు ఉంటారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ ట్విట్టర్లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
5 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించిన విశ్వక్సేన్
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్ తన వంతు సాయం ప్రకటించారు. ఐదు లక్షల విరాళంగా ఆయన అందించనున్నట్లు పేర్కొన్నారు. విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో శని ప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆయ్ చిత్ర బంధం సైతం వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. సోమవారం నుంచి వారాంతం వరకు ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లు 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.