కళ్ళజోడే కంప్యూటర్.. ఏఆర్ గ్లాసెస్ ఓరియన్ ఆవిష్కరించిన మెటా సీఈవో జుకర్ బర్గ్

మెటా స్మార్ట్ ఫోన్ ను మరిపించే సరికొత్త ఆవిష్కరణను చేసింది. 'ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్' మెటా సీఈవో జుకర్ బర్గ్ ప్రపంచానికి ప్రదర్శించారు. ఓరియన్ పేరుతో రూపొందించిన ఈ ఏఆర్ గ్లాసెస్ ను మన మెదడు సంకేతాలతో, కంటి చూపుతో, చేతి కదలికలతో నియంత్రించవచ్చు. ఆ విధంగా దీనిని రూపొందించారు. అలా నియంత్రించేందుకు చేతి మణికట్టుకు ఒక బ్యాండును ధరించాల్సి ఉంటుంది. డిజిటల్ కంటెంట్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చు.

 Augmented Reality Glasses

ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్

సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. విభిన్న ఆవిష్కరణలతో మనిషి జీవితాన్ని మరింత సులభతరం, అడ్వాన్సుడ్ గా చేస్తున్నాయి. తాజాగా మెటా నుంచి మరో విభిన్నమైన ఆవిష్కరణ వచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో వచ్చిన అనేక వస్తువులను.. మరెన్నో వస్తువులను కాలగర్భంలో కలిపేసాయి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత రేడియో, టేప్ రికార్డర్, కాలిక్యులేటర్ వంటి ఎన్నో ఉపకరణాలు కనిపించకుండా పోయాయి. తాజాగా మెటా స్మార్ట్ ఫోన్ ను మరిపించే సరికొత్త ఆవిష్కరణను చేసింది. 'ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్' మెటా సీఈవో జుకర్ బర్గ్ ప్రపంచానికి ప్రదర్శించారు. ఓరియన్ పేరుతో రూపొందించిన ఈ ఏఆర్ గ్లాసెస్ ను మన మెదడు సంకేతాలతో, కంటి చూపుతో, చేతి కదలికలతో నియంత్రించవచ్చు. ఆ విధంగా దీనిని రూపొందించారు. అలా నియంత్రించేందుకు చేతి మణికట్టుకు ఒక బ్యాండును ధరించాల్సి ఉంటుంది. డిజిటల్ కంటెంట్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చు. కంప్యూటర్ల తరహాలోనే ఒకేసారి పలు వర్చువల్ విండోలు ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. ఆ విండోలో మనకు కనిపించే వాటిలో ఒకదానిని ఎంచుకోవడానికి మన కళ్ళే మౌస్ పాయింటర్ల మాదిరిగా పని చేస్తాయి. దాన్ని క్లిక్ చేయడానికి మన చేతి వెళ్ల కదలికలే సంకేతాలవుతాయి. దీంతో వీడియో గేమ్స్ ఆడొచ్చు, వీడియో కాల్స్ చేయవచ్చు. వీడియో కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తుల లైఫ్ సైజ్ హోలోగ్రామ్ లను మన ముందు ప్రదర్శిస్తాయి. ఈ కళ్ళ జోడును ధరించి మన ముందున్న వస్తువులను చూస్తే ఇందులో ఉండే ఏఐ వాటిని గుర్తించి వాటి పేర్లను డిస్ ప్లే చేస్తుంది. అక్కడున్న పదార్థాలతో ఏ వంటకాన్ని తయారు చేయవచ్చు అడిగితే సలహాలు ఇస్తుంది  ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళ జోడును కాదు ఒక కంప్యూటర్ ను కళ్ళకు ధరించినట్లే ఉంటుందన్నమాట.

ఈ కళ్ళజోడు తయారీలో వినియోగించిన అద్దాలు గాజువి కావు. సిలికాన్ కార్బైడ్ మెటీరియల్ తో తయారు చేశారు. ప్రేమ్ ని మెగ్నీషియంతో తయారు చేశారు. ఇందులో ఉండే మైక్రో ఎల్ఈడి ప్రొజెక్టర్లు 70 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ ఉండే హోలో గ్రాఫిక్ డిస్ ప్లేను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన కళ్ళజోడుగా జోకర్ బర్గ్ దీనిని బహిర్గతం చేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు. నిజానికి మెటా సంస్థ దశాబ్ద కాలంగా వీటిపై కృషి చేస్తోంది. మెటాతోపాటు ఇంకా చాలా కంపెనీలు ఈ తరహా ఏఆర్ గ్లాసెస్ ను తయారు చేయడంలో బిజీగా ఉన్నాయి. వాటిలో స్నాప్ అనే కంపెనీ స్పక్టికల్స్ 5 పేరుతో ఇటీవల ఒక కళ్ళ జోడును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో పోలిస్తే ఓరియన్ గ్లాసెస్ చాలా చిన్నగా, మామూలు కళ్లద్దాలు మాదిరిగా కనిపించడం గమనార్హం. ఈ కళ్ళజోళ్ళు ఉత్పత్తి ఖర్చు ఒక్కొక్క దానికి పదివేల డాలర్లు అవుతోంది. అంత ధర పెడితే కొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు మెటా కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ ధరకే ఏఆర్ గ్లాసెస్ కూడా మరికొన్ని నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని జుకర్ బర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని బరువు 98 గ్రాములు. దీన్ని కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్