తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తొలి రోజు 5 కీలక బిల్లులతో పాటు రెండు కీలక నివేదికలను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుకు సంబంధించి సభలో సీఎం రేవంత్ వివరించారు.
టీ షర్టులతో వచ్చిన కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తొలి రోజు 5 కీలక బిల్లులతో పాటు రెండు కీలక నివేదికలను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుకు సంబంధించి సభలో సీఎం రేవంత్ వివరించారు. పెన్షన్లలో కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రవేశపెట్టబడుతుందని సభ దృష్టికి తీసుకురానున్నారు. అదే సమయంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పున ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రదృష్టి ఈ బిల్లు పైనే నెలకొని ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిస్థితిలో ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా మార్చే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీతాలు చెల్లింపు, పెన్షన్ల మంజూరు, అనర్హుల తొలగింపులకు సంబంధించిన ఆర్డినెన్స్, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సమావేశాలకు ఒక కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుని వస్తోంది. టిఆర్ఎస్ సమావేశాలకు హాజరవుతుందా.? లేదా.? అన్నదానిపై సందిగ్దత తొలుత నెలకున్నప్పటికీ.. అనూహ్యంగా ఉదయం 10 గంటలకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. అదానీ, రేవంత్ బాయ్.. బాయ్ అని ముద్రించిన టీ షర్టులతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై అభ్యంతరం తెలిపిన పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ టీ షర్టులను ధరిస్తే అసెంబ్లీ లోపలకు అనుమతించబోమంటూ భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో భారతీయ రాష్ట్ర సమితి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడ్డుకోనప్పుడు ఇక్కడ ఎలా అడ్డుకుంటారని కేటీఆర్ పోలీసులు, భద్రతా సిబ్బందిపై మండిపడ్డారు. తాము ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా ప్రభుత్వం చెబుతుందా అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులు భారతీయ రాష్ట్ర సమితి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ హాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.