12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ సిద్ధమవుతోంది 45 రోజులపాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మహా కుంభమేళా కోసం ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రత విషయంలో రాజీ పడకుండా 50 వేల మంది సిబ్బందిని మోహరించింది.
కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు
12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ సిద్ధమవుతోంది 45 రోజులపాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మహా కుంభమేళా కోసం ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రత విషయంలో రాజీ పడకుండా 50 వేల మంది సిబ్బందిని మోహరించింది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల 100 మీటర్ల లోతులోనే వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ (జలాంతర) డ్రోన్లను ఉపయోగించనున్నారు. కుంభమేళా కోసం కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన 2,700 సీసీ కెమెరాలతో 24 గంటలు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా.. వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులోకి ఉంచనున్నారు. మరోవైపు నేత్ర కుంభ శిబిరం ద్వారా ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, మూడు లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం రెండు వేలకపైగా ఆ డ్రోన్లతో భారీ డ్రోన్ షో కూడా ఏర్పాటు చేస్తోంది. మరోవైపు కుంభమేళా యాత్రికుల కోసం 12 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. 2025 జనవరి 18 ఫిబ్రవరి 8, 15, 22 తేదీల్లో తిరుపతి - బనారస్, ఫిబ్రవరి 20, 17, 24 తేదీల్లో బనారస్ విజయవాడ మధ్య రైళ్లు నడపనున్నారు.
రూ.7,500 కోట్లు కేటాయింపు
మహా కుంభమేళాను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.7500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు రూ.40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. 1882లో భారత దేశ జనాభా 22.5 కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్యనాడు ఎనిమిది లక్షల మంది పవిత్ర సంఘమంలో స్నానమాచరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది రూ.20,288 మాత్రమే. ఇప్పుడు ఏకంగా రూ.7500 కోట్లతో విస్తృతంగా ఏర్పాట్లను యోగి ప్రభుత్వం చేస్తుంది. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రత్యేకంగా యోగి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసేలా చూడాలంటూ ఇప్పటికే సీఎం యోగి ఆదేశాలను జారీ చేశారు. ఈ మహా కుంభమేళా చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే నిధులు మంజూరుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఈ మహా కుంభమేళాకు దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు స్నానాలను ఆచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతరం ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసేలా సిబ్బందిని మోహరిస్తున్నారు.