చిన్నారులు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. ఫోన్ చేతికి ఇస్తే గాని అన్నం తిననని మారాం చేసే పిల్లల సంఖ్య పెరిగింది. ఫోన్ తోనే గంటల తరబడి పిల్లలు గడుపుతూ అనేక ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పనులకు పిల్లల నుంచి ఆటంకం ఎదురు కాకుండా ఉండేందుకు ముందుగానే వారి చేతికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈ అలవాటు క్రమంగా వారిని వ్యసనానికి బానిసలుగా చేస్తూ అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ తో చిన్నారి
ఈ మధ్యకాలంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. ఫోన్ చేతికి ఇస్తే గాని అన్నం తిననని మారాం చేసే పిల్లల సంఖ్య పెరిగింది. ఫోన్ తోనే గంటల తరబడి పిల్లలు గడుపుతూ అనేక ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పనులకు పిల్లల నుంచి ఆటంకం ఎదురు కాకుండా ఉండేందుకు ముందుగానే వారి చేతికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈ అలవాటు క్రమంగా వారిని వ్యసనానికి బానిసలుగా చేస్తూ అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలు తరబడి ఫోన్ చూస్తూ ఉండడం వల్ల పిల్లల్లో కంటి సంబంధిత సమస్యలతోపాటు బుద్ధి మాంద్యం వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఎక్కువ సమయంపాటు ఫోన్ వినియోగించడం వల్ల మయోఫియో సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల మయోపియా సమస్య ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు ఫోన్, ట్యాబ్ వంటి పరికరాల ముందు కూర్చున్నప్పుడు కళ్ళు పెద్దగా చేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సరిగ్గా రెటీనా మీద ఫోకస్ కావాల్సిన కాంతి కిరణాలు రెటీనాకు కాస్త ముందే ఫోకస్ అవుతున్నాయి. దీనివల్ల కంటిలోని రెటీనా భాగంపై చిత్రాలు సరిగ్గా పడినప్పుడు హ్రస్వదృష్టి సమస్య తలెత్తుతోంది. దీనివల్ల దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే మంచిగా కనిపిస్తూ దూరంగా ఉన్న వస్తువులు మసగ్గా కనిపిస్తుంటాయి. ఇంట్లోనే ఎక్కువగా ఉండి సన్ లైట్ తక్కువగా తీసుకునే పిల్లల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. సూర్యకాంతి కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మయోఫియో సమస్యను తగ్గించగలదు. సెల్ ఫోన్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెదడుకి హాని కలిగించడంతోపాటు పిల్లల మెదడు అభివృద్ధి కూడా కుంటు పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం కూర్చునే చిన్నారుల్లో ఆలోచన శక్తి, నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోందని పలు అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. గంటల తరబడి ఫోన్ వినియోగించే పిల్లల్లో సోషల్ స్కిల్స్ తగ్గుతున్నాయని, ఎమోషన్స్ కూడా సరిగా ఉండడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఫోన్ వినియోగించే ఎక్కువ మంది పిల్లల్లో థింకింగ్ పవర్ కూడా తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. స్మార్ట్ ఫోన్లను వాడితే వారి మెదడు సహజంగా అభివృద్ధి చెందదు. పిల్లల మెదడు చాలా త్వరగా నేర్చుకుంటాయి. ఏ కొత్త విషయాన్ని అయినా త్వరగా గ్రహిస్తారు. కానీ, పిల్లలు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వంటివి ఎక్కువగా వినియోగించడం వల్ల మెదడు అభివృద్ధి తగ్గుతుంది. దీనివల్ల ఏది త్వరగా నేర్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో చదువు పట్ల ఆసక్తి తగ్గుతున్నట్లు పలువురు నిపుణులు గుర్తించారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించే పిల్లల సోషల్ స్కిల్స్, మెంటల్ హెల్త్ కండిషన్స్ సరిగా ఉండడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరహా ఫోన్ వినియోగంతో ఉండేవాళ్లు ఎవరితోనూ కలిసేందుకు ఇష్టపడరని, ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారని, ఆత్మన్యూనత భావంతో బాధపడుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ముందుగానే పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా ఇటువంటి సమస్యల నుంచి వారిని విముక్తి చేసే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, తల్లిదండ్రులు తమ పనులను పూర్తి చేసుకునే ఉద్దేశంతో కావాలనే వారికి ఫోన్లను ఇచ్చి భవిష్యత్తులో వారు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేలా చేయడంతోపాటు మానసిక సమస్యలు బారిన పడేలా చిన్నారులను ప్రోత్సహించినట్టు అవుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.