హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ అనేక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. కానీ, ఫలితాలు అందుకు విరుద్ధంగా బిజెపికి అనుకూలంగా వస్తున్నాయి. ఫలితాలు ప్రారంభమైన మొదటి చాలా సేపటి వరకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకునే దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా బిజెపి పుంజుకొని మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం దిశగా సాగుతోంది. దీంతో మూడోసారి హర్యానాలో బిజెపి అధికారాన్ని దక్కించుకోవడం దాదాపు కన్ఫామ్ అయినట్టే.
ఎగ్జిట్ పోల్స్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ అనేక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. కానీ, ఫలితాలు అందుకు విరుద్ధంగా బిజెపికి అనుకూలంగా వస్తున్నాయి. ఫలితాలు ప్రారంభమైన మొదటి చాలా సేపటి వరకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకునే దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా బిజెపి పుంజుకొని మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం దిశగా సాగుతోంది. దీంతో మూడోసారి హర్యానాలో బిజెపి అధికారాన్ని దక్కించుకోవడం దాదాపు కన్ఫామ్ అయినట్టే. ఒక దశలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుంటుందన్న వార్తలు రావడంతో ఇటు ఢిల్లీలోను, అటు హర్యానాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అయితే అనూహ్యంగా బిజెపి స్పీడ్ పెరగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైలెంట్ అయిపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనా మరోసారి తప్పినట్టు అయింది. గత కొన్నాళ్లుగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు అనేక రాష్ట్రాల్లోని ఫలితాలను సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యాయి. ప్రజల నాడిని అందుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ దాదాపు విఫలమవుతున్నాయని చెప్పవచ్చు. హర్యానా ఫలితాలు కూడా మరోసారి ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు దూరంగా ఉంటున్నాయనే విషయాన్ని స్పష్టం చేశాయి. కొద్దిరోజుల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లోను ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పు అయింది. ఏపీలో ఏ పార్టీ అయినా నామమాతృప్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో కూడా బిజెపి 300కుపైగా సీట్లను సాధిస్తుందంటూ అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి. జాతి స్థాయిలో ఫలితాలు కూడా అందుకు విరుద్ధంగానే వచ్చాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మూడు రోజుల కిందట వెలువరించాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధిస్తుందంటూ అనేక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. కానీ ఇక్కడ అనూహ్యంగా మరోసారి బిజెపి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగుల ముందుకు వేస్తోంది. మూడోసారి హర్యానాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. జట్ స్పీడ్ తో అధిక్యంలోకి వచ్చిన బిజెపి.. కాంగ్రెస్ పార్టీని 30 పైచిలుకు సీట్లకు మాత్రమే పరిమితం చేసింది.
బిజెపి 46కుపైగా సీట్లను దాటి ముందుకు సాగుతోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ప్రజల నాడిని పట్టుకోవడం సాధ్యం కావడం లేదంటూ ఒక ప్రముఖ రాజకీయ అని విశ్లేషకుడు పేర్కొన్నారు. ప్రజలు ఓటు వేసిన విషయాన్ని చెప్పేందుకు అంగీకరించకపోవడం వల్లే ఎగ్జిట్ పోల్స్ కూడా వాస్తవికతను తెలియజేయలేకపోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. అంతర్గతంగా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్న ఓటరు.. బహిర్గతంగా మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఈ కారణంతోనే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థల అంచనాలు తప్పు అవుతున్నట్లు చెబుతున్నారు. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు విజయం సాధించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు బిజెపి 47 స్థానాల్లో విజయం సాధించి ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డి రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకుపోతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 43 స్థానాల్లో, బిజెపి 28, టిడిపి 2, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి ఇతరులు మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బిజెపి, పీడిపి ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి.