గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి వెళుతున్న వారి సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. కానీ వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్నిచేలా ఒక కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే రాయలసీమ ప్రాంతానికి చెందిన శైలజానాథ్. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈయన విభజన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడుగాను పనిచేశారు. వైసీపీలోకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులతో శైలజానాథ్ సంప్రదింపు జరిపినట్లు చెబుతున్నారు.
వైసిపి అధినేత జగన్ తో శైలజనాథ్
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పడిపోయింది. దీంతో వైసీపీలో గడిచిన ఐదేళ్లు పదవులు అనుభవించిన ఎంతోమంది నాయకులు ఆ పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారితోపాటు మంత్రులుగా పనిచేసిన వారు కూడా వైసిపికి గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వెళుతున్న నేతలతో కేడర్ కూడా ఆందోళన చెందుతోంది. రానున్న రోజుల్లో వైసిపి పని పూర్తిగా అయిపోతుందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు శుభవార్త ఒకటి వినిపిస్తోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి వెళుతున్న వారి సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. కానీ వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్నిచేలా ఒక కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే రాయలసీమ ప్రాంతానికి చెందిన శైలజానాథ్. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈయన విభజన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడుగాను పనిచేశారు. వైసీపీలోకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులతో శైలజానాథ్ సంప్రదింపు జరిపినట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట రాయలసీమలో ఒక వివాహానికి హాజరైన జగన్మోహన్ రెడ్డితో ఆత్మీయ ఆలింగనం కూడా శైలజానాథ్ చేసుకున్నారు. శైలజనాథ్ కూడా వైసీపీలో చేరేందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఏడాది తొలి నెలలోనే శైలజనాథ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన తన ఆత్మీయులతో మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజనాథ్ సీనియర్ రాజకీయనేతగా పేరుగాంచారు. సింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2024 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరుతారా అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆయన ఎందుకో టిడిపిలో చేరలేదు. ఈ మధ్యకాలంలో ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే స్థానికంగా తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన వారి నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అన్ని సవ్యంగా జరిగితే కొత్త ఏడాది తొలి నెలలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆయన వైసీపీలో చేరతారా.? లేదా.? ఇంకేమైనా ఆలోచన ఉందా.? అన్న దానిపై వేచి చూడాల్సి ఉంది.