ఈపీఎఫ్ఓ విత్ డ్రా లిమిట్ భారీగా పెంపు.. ఐదు లక్షల వరకు తీసుకునే అవకాశం.!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఆటో సెటిల్మెంట్ పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంది. అయితే ఈ మొత్తాన్ని ఐదు లక్షల వరకు పెంచేందుకు ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. కొద్దిరోజుల్లోనే దేనిని అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదే జరిగితే 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. కొద్దిరోజులు కిందట నిర్వహించిన కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కలుగుతుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఆటో సెటిల్మెంట్ పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంది. అయితే ఈ మొత్తాన్ని ఐదు లక్షల వరకు పెంచేందుకు ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. కొద్దిరోజుల్లోనే దేనిని అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదే జరిగితే 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. కొద్దిరోజులు కిందట నిర్వహించిన కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈపీఎఫ్ఓ అమౌంటు తీసుకోవాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. లక్ష రూపాయలకు మించి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్య నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేలా తాజా నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్ ను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి వాటికోసం అడ్వాన్సుగా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది. అయితే ఎంత అమౌంట్ ఉన్నప్పటికీ లక్షకు మించి తీసుకునే అవకాశం లేకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా 5 లక్షల వరకు విద్యుత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం తాజాగా కల్పించింది. దీనివల్ల లక్షలాదిమంది కార్మికులకు మేలు చేకూరుతుంది. 2024లో ఆటో అప్రూవ్డ్ క్లెయిమ్ల పరిమితిని 50 వేల నుంచి లక్షకు పెంచారు. ఆ తరువాత దీనిని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. అయితే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేందుకు కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్చారు 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 95 శాతం ఆటోమోడ్ క్లెయిమ్లు పరిష్కారం కావడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు కూడా భారీగా తగ్గింది. గతంలో 50% మేర తిరస్కరణ రేటు ఉండగా.. తాజాగా తిరస్కరణ రేటు 30 శాతానికి తగ్గింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్