577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈపీఎఫ్ఓ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (epfo) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఈపీఎఫ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(ఈవో), అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏవో)తో పాటు అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (APFC) మొత్తం 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

మొత్తం పోస్టులు 577

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈవో)/అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏవో) ఉద్యోగాలు : 418 

అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పోస్టులు : 159 

దరఖాస్తు ప్రారంభం :  2023 ఫిబ్రవరి 25

దరఖాస్తుకు చివరి తేదీ : 2023 మార్చి 17

దరఖాస్తు ఫీజు:  జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

విద్యార్హతలు-  ఏదైనా డిగ్రీ ఉండాలి.

వయస్సు- ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల. ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు.

దరఖాస్తులు విధానం : ఆన్ లైన్ 

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  : ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12గంటల నుంచి మార్చి 17న సాయంత్రం 6గంటల వరకు ముగుస్తుంది. 

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తో ఎంపిక చేస్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్