ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు.. 80 లక్షల మందికి చేకూరనున్న లబ్ధి.?

దేశంలోని కోట్ల మంది పెన్షనర్లకు శుభవార్తను చెప్పేందుకు సిద్ధమవుతోంది ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ). తమ ఉద్యోగుల పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి 3 వేలకు పెంచి.. అలా వివిధ దశల్లో పెంచుతూ మొత్తంగా రూ.7500 పెంచేలా ఒక భారీ ప్రణాళికను వేసుకుంది. ఇది ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించిన ఈపీఎస్ -95 కిందకు వస్తుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా 80 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళకు ఈ స్కీం ద్వారా ప్రతినెలా పెన్షన్ వస్తోంది. తక్కువలో తక్కువ వేయి రూపాయలు 2014 నుంచి ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం వారికి ఎటువంటి అవసరాలను తీర్చడం లేదు. బయట చూస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని కోట్ల మంది పెన్షనర్లకు శుభవార్తను చెప్పేందుకు సిద్ధమవుతోంది ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ). తమ ఉద్యోగుల పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి 3 వేలకు పెంచి.. అలా వివిధ దశల్లో పెంచుతూ మొత్తంగా రూ.7500 పెంచేలా ఒక భారీ ప్రణాళికను వేసుకుంది. ఇది ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించిన  ఈపీఎస్ -95 కిందకు వస్తుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా 80 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళకు ఈ స్కీం ద్వారా ప్రతినెలా పెన్షన్ వస్తోంది. తక్కువలో తక్కువ వేయి రూపాయలు 2014 నుంచి ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం వారికి ఎటువంటి అవసరాలను తీర్చడం లేదు. బయట చూస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. రూ.500 పెడితే కూరగాయలు కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేయి రూపాయలు పెన్షన్ ఎటువంటి అవసరాలను తీర్చడం లేదన్న భావన సర్వత్ర వ్యక్తం అవుతుంది. 2014కు ఇప్పటికీ ధరలు దాదాపు రెండు రెట్లు పెరిగిపోయాయి. దీంతో పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అంటూ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి ఎంపీ బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ పెన్షనర్ల పరిస్థితులను గమనించి వాళ్లకు నేలకు కనీస పెన్షన్ రూ.7,500 ఉండాలని సూచించింది. అంతకంటే తక్కువ పెన్షన్ ఉండకూడదని స్పష్టం చేసింది. ఒకేసారి అంత పెంచాలంటే కేంద్రానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ముందుగా కనీస పెన్షన్ రూ.3000 చేద్దామని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత వివిధ దశల్లో పెన్షన్ ను రూ.7500 వరకు పెంచుకుంటూ పోతారని సమాచారం. పెన్షన్ పెంచితే పెన్షనర్లు ఆనందపడతారు. వారి రోజువారి ఖర్చులకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. అటువంటి వాళ్లకు మందులకు కూడా డబ్బు సరిపోవడం లేదు. ఆ జనరిక్ మందుల షాపులు ఎక్కడోగాని ఉండవు. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా కేంద్రంలో చర్చ జరిగింది.

ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ దీనిపై తాజాగా స్పందించారు. పెన్షనర్ల డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నామని స్పష్టం చేశారు. దీన్ని బట్టి పెన్షన్ పెంపు ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ఉండబోతున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పెన్షనర్లు ఇప్పటికే పెన్షన్ పెంచాలని ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈపీఎఫ్ఓ సంస్థ ఒక మంచి పని చేసినట్లు చెబుతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలు ఈజీగా త్వరగా చేసుకునే వీలు కల్పించింది. అది కొంత మందికి అనుకూల నిర్ణయంగా మారింది. వారు పెన్షన్ డబ్బు చాలకపోతే పీఎఫ్ నుంచి డబ్బు తీసుకుని సర్దుబాటు చేసుకుంటారు. ఇలాంటి సమయంలో వారికి పెన్షన్ కూడా పెంచితే మరింత బాగుంటుంది. త్వరలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ (సిబిటి) సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో ఈ పెన్షన్ పెంపుపై ఒక ప్రకటన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇది దేశ వ్యాప్తంగా పెన్షనర్లకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. వారి కుటుంబ సభ్యుల నుంచే కాకుండా సమాజం నుంచి కూడా గౌరవం పొందుతారు. ఈ పెన్షన్ పెంపు మార్పు ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు. దేశంలోని కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు గుర్తింపుగా నిలుస్తుందనీ పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్