ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల మార్పులను మీరే చేసుకోవచ్చు.. అది ఎలా అంటే.?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ సభ్యులు ఇకమీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో తమంతట తామే మార్చుకోవచ్చు ఇప్పటి వరకు ఎటువంటి మార్పులకు ఈపీఎఫ్ కార్యాలయాలకు ఇతర ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇకపై తమంతట తానే మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. యజమాని ధ్రువీకరణ గాని, ఈపీఎఫ్ఓ ఆమోదంగాని అవసరం లేదు. యజమాని ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ ఖాతా బదిలీకి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ సభ్యులు ఇకమీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో తమంతట తామే మార్చుకోవచ్చు ఇప్పటి వరకు ఎటువంటి మార్పులకు ఈపీఎఫ్ కార్యాలయాలకు ఇతర ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇకపై తమంతట తానే మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. యజమాని ధ్రువీకరణ గాని, ఈపీఎఫ్ఓ ఆమోదంగాని  అవసరం లేదు. యజమాని ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ ఖాతా బదిలీకి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ లో కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లి/తండ్రి పేరు, భార్య/భర్త పేరు, ఈపీఎఫ్ లో చేరిన తేదీ, వైదొలగే తేదీ వంటి వ్యక్తిగత వివరాల నమోదులో తప్పులను ఇకమీదట సభ్యులు స్వయంగా సరిదిద్దుకోవచ్చన్నారు. ఆధార్ నెంబర్ తో అనుసంధానిస్తూ 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత యూఏఎన్ జారీ అయిన సభ్యులకే ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఈ తేదీ కంటే ముందు యుఏఎన్ జారీ అయిన సభ్యుల వ్యక్తిగత వివరాల్లో సవరణలను వారు పనిచేసే కంపెనీలే చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఈ మార్పులు జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

ఆధారతో అనుసంధానించని ఖాతాల విషయంలో మాత్రం వ్యక్తిగత వివరాల్లో మార్పులు కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యజమానికి అందిస్తే వాటిని యజమాని పరిశీలించి ఈపీఎఫ్ఓ పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ ఆమోదం తర్వాత మార్పులు నమోదు అవుతాయని మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్ ఖాతా బదిలీ అంశంపై స్పందిస్తూ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ ఖాతాదారులు యజమాని ప్రమేయం లేకుండానే ఆధార్ ఓటిపితో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వ్యక్తిగత వివరాల్లో మార్పులు కోసం కానీ, ఖాతా బదిలీ కోసం గానీ ఇప్పటికే యజమానికి దరఖాస్తు చేసుకున్నవారు దానిని ఉపసంహరించుకోవచ్చని, ఆన్లైన్లో తానే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాదా నిర్ణయం పట్ల ఈపీఎఫ్ ఖాతాదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ ఖాతాదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఆనందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ తరహా మార్పులు కోసం యజమానులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల అటువంటి ఇబ్బందులు ఉండదని పలువురు ఈపీఎఫ్ ఖాతాదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్