జార్ఖండ్ అసెంబ్లీతోపాటు వయనాడ్ పార్లమెంటు స్థానానికి రేపే ఎన్నికలు

జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ తోపాటు వయనాడ్ పార్లమెంటు స్థానం సహా కొన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాటు చేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

Prime Minister Modi and Rahul Gandhi

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ తోపాటు వయనాడ్ పార్లమెంటు స్థానం సహా కొన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాటు చేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 683 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 950 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది హెలీ డ్రాపింగ్ ద్వారా 194 పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతోపాటు కర్ణాటకలోని మూడు అసెంబ్లీ, మధ్యప్రదేశ్లోని రెండు, అస్సాంలోని ఐదు అసెంబ్లీ, రాజస్థాన్లోని ఏడు, కేరళలోని చలక్కర అసెంబ్లీ స్థానాలకు, వయనాడ్ లోక్ సభ స్థానానికి కూడా బుధవారమే ఎన్నిక జరగనుంది. వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమెపై ఎల్డిఎఫ్ సత్యన్ మొకేరిన్ అభ్యర్థిగా నిలబడ్డారు. నవ్య హరిదాసు బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిపింది. 

కర్ణాటకలోని షిగ్గావ్, చన్నపట్న, సండూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. షిగ్గావ్ లో ఎనిమిది మంది, చన్నపట్నంలో 31 మంది, సాండూర్ లో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. షిగ్గావ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ను బిజెపి పోటీలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పై భరత్ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బుద్ని, విజయపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో దోళై, సిడ్లి, బెహలి, బొంగైగావ్, సంగురి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు మొత్తం 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజస్థాన్ లో ఝంఝూను, దౌసా, ఖిన్కసర్, డియోలి - ఉనియారా, సాలంబేర్, చౌరాసి, రామ్ ఘడ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్