వృద్ధ తెలంగాణ.. గణనీయంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా

దేశంలో వృద్ధ జనాభా గణనీయంగా పెరుగుతోంది. భారత్ లో మొన్నటి వరకు యువకుల సంఖ్య అధికంగా ఉండేది. అయితే ఈ సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్నాళ్ల కిందటి వరకు అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా చైనా ఉంటే.. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ భర్తీ చేసింది. యువశక్తి అధికంగా ఉన్న దేశంగా భారత్ అంటూ సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు పెరిగిన ప్రాధాన్యత వృద్ధుల జనాభా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో వృద్ధ జనాభా గణనీయంగా పెరుగుతోంది. భారత్ లో మొన్నటి వరకు యువకుల సంఖ్య అధికంగా ఉండేది. అయితే ఈ సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్నాళ్ల కిందటి వరకు అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా చైనా ఉంటే.. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ భర్తీ చేసింది. యువశక్తి అధికంగా ఉన్న దేశంగా భారత్ అంటూ సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు పెరిగిన ప్రాధాన్యత వృద్ధుల జనాభా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జాతీయ జనాభా కమిషన్ ఇచ్చిన లెక్కలతో సోమవారం తెలంగాణ ప్రణాళిక శాఖ విడుదల చేసిన రాష్ట్ర జనాభా గణాంకాల్లో వైశ్యులు వారి జనాభా వృక్షం యొక్క వివరాలు వెల్లడయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.5 కోట్ల మంది జనాలు ఉండగా.. 2026 నాటికి 3.86 కోట్లకు చేరుకుంటుందని కమిషన్ అంచనా వేసింది. 200036 నాటికి 4.6% వృద్ధితో 3.94 కోట్లకు చేరనుంది.

ఇందులో పురుషులు 1.97 కోట్లు కాగా, మహిళలు 1.97 కోట్లు. అయితే ఈ పెరిగే జనాభాలో 2021 నుంచి 236 మధ్య 35 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కుల జనాభా గణనయంగా పెరగబోతోంది. అదే కాలంలో సున్నా నుంచి 34 ఏళ్ల వయసుగల వారి వృద్ధిరేటు మైనస్ లో ఉండడం గమనార్హం. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు 20 శాతానికి పైగా తగ్గుతున్నారు. ఒకవైపు మధ్య వయస్కులు, వృద్ధుల సంఖ్య రాబోయే పదాలలో గణనీయంగా పెరుగుతుంటే.. అదే స్థాయిలో యువశక్తి తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా అని పనులు చెబుతున్నారు. 2021 నుంచి 2036 మధ్యకాలంలో 20 నుంచి 24 ఏళ్ల వయసు గలవారు 33.94 లక్షల నుంచి 26.26 లక్షలకు తగ్గనుంది. అంటే 22.6% తగ్గుదలగా నమోదు అవుతుంది. 25 నుంచి 29 మధ్య వయసుగల యువతరం 2021లో 34.16 లక్షలు ఉంటే.. 2036 నాటికి 19.3 శాతం తగ్గుముఖం పట్టి 27.57 లక్షలకు చేరుకుంటుంది. ఇదే క్రమంలో 30 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కుల వారు 33.50 లక్షల నుంచి 30.33 లక్షలకు చేరుకోనున్నారు. యువతతోపాటు 0 నుంచి 4 ఏళ్ల వయసు గల చిన్నారుల సంఖ్య 2036 నాటికి ఏకంగా 25 శాతం తగ్గుతుండగా, 5 నుంచి 9 వయస్సు గలవారు 20 శాతం తగ్గనున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 10-14 మధ్య కౌమార వయసు జనభాతోపాటు 15 నుంచి 19 మధ్య టీనేజ్ వయసు గల యువతీ, యువకులు కూడా 17 శాతానికి పైగా తగ్గుతారని జనాభా కమిషన్ పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్