పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలోని ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ ప్రక్రియ సాగుతోంది. తొలుత స్థానిక పోలీసులు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ సాగింది. విచారణపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేయిస్తోంది.
ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలోని ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ ప్రక్రియ సాగుతోంది. తొలుత స్థానిక పోలీసులు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ సాగింది. విచారణపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేయిస్తోంది. సిబిఐ అధికారుల బృందం ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురును ఇప్పటికే విచారించింది. పలువురికి లై డిటెక్టర్ పరీక్షలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది. కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లోని హౌరా, సోనాపూర్, హుబ్లీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడి బృందాలు సాదాలు నిర్వహిస్తున్నాయి. అత్యాచారం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. సిబిఐ కేస్ ఆధారంగా ఈడి కేసు రిజిస్టర్ చేసింది. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో అక్రమాల వ్యవహారంలో సిబిఐ సందీప్ ఘోష్ ను అరెస్టు చేసి విచారిస్తోంది. ఆయన ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఎనిమిది రోజులపాటు ఘోష్ ను విచారించేందుకు కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి సంబంధించిన కేసును సిబిఐ అధికారుల బంధం జోరుగా విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సంజయ్ రాయ్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.
తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు
అత్యాచారానికి గురై హత్య గావించబడిన వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూసారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసి వేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు సాగించారని తల్లిదండ్రులు మండిపడ్డారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలు తల్లిదండ్రులు మాట్లాడుతూ పోలీసులు మొదటి నుంచి కేసులు మూసి వేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. మృతదేహాన్ని చూడటానికి కూడా తమకు అనుమతించలేదని, మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హడావిడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని ఆరోపించారు. మృతదేహాన్ని తమకు అప్పగించినప్పుడు ఒక సీనియర్ పోలీసు అధికారి తమకు డబ్బులు ఆఫర్ చేశారని, కానీ తాము వెంటనే దాన్ని తిరస్కరించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలలో పాల్గొంటున్నామంటూ బాధితురాలు తండ్రి పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు, పలు సంఘాలు ఆధ్వర్యంలో నిరసనలు పెరిగిపోతున్నాయి.