బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారాలపై ఈడీ ఫోకస్‌.. కీలక చర్యలకు అవకాశం.!

గడిచిన కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారి వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సజ్జనార్‌ ఆదేశాలు మేరకు విశాఖకు చెందిన నానితోపాటు మరికొందరు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన నటీమణులు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారి వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సజ్జనార్‌ ఆదేశాలు మేరకు విశాఖకు చెందిన నానితోపాటు మరికొందరు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన నటీమణులు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్న బెట్టింగ్‌ యాప్స్‌పై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ యాప్స్‌ను ప్రచారం చేసిన యూట్యూబర్లు, వారికి జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన కేసులు వివరాలను ఈడీ తెప్పించుకుని దర్యాప్తును చేసే పనిని ప్రారంభించింది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేందుకు పలువురు యూట్యూబర్లు తమ చానెల్స్‌ను వినియోగించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. తమ వీడియోలతో వినియోగదారులను ఆకర్షించి, వారి నుంచి డబ్బులు సేకరించే ప్రక్రియలో ఈ యూట్యూబర్లు కీలక పాత్ర పోషించినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంలో 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు యూట్యూబర్లు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం పొందిన ఆదాయం, దాని మూలాలు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ యాప్‌లు ద్వారా సేకరించిన డబ్బు చట్టవిరుద్ధమైన మార్గాలు ద్వారా బదిలీ అయినట్టు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్‌తోపాటు హవాలా వ్యవస్థ ద్వారా ఈ నిధులు విదేశాలకు బదిలీ అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలు అనేక షెల్‌ కంపెనీలు, డమ్మీ బ్యాంకు ఖాతాలు ద్వారా జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ నిధులను క్రిఫ్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా నగదుగా ఉపసంహరించడం వంటి పద్ధతుల కూడా వినియోగించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను ఆధారంగా చేసుకుని ఈడీ బెట్టింగ్‌ వ్యవహారాలపై దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలిసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్