ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసుకునే వెసులుబాటు.. ఏటీఎం తరహాలో కార్డులు.!

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది మే నుంచి జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో దేశంలో ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకు నుంచి అయినా పింఛన్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. దీనిపై ఈపీఎఫ్ పెన్షన్ దారులు, పిఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు తమ పిఎఫ్ సొమ్ము తీసుకోవాలంటే ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఏడు నుంచి పది రోజులు వరకు నిరీక్షించిన తర్వాతే ఆ సొమ్ము ఎకౌంట్లో జమ అవుతూ వస్తోంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకోవాలనుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది మే నుంచి జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో దేశంలో ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకు నుంచి అయినా పింఛన్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. దీనిపై ఈపీఎఫ్ పెన్షన్ దారులు, పిఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే తమకు ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రీకృత పింఛన్ చెల్లింపులు వ్యవస్థ విస్తరణను కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ 2.0 వ్యవస్థను ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ చందాదారులకు ఈపీఎఫ్ఓ 3.0 అనే వ్యవస్థ కింద ఏటీఎం కార్డులు అందించనుంది. ఈ ఏడాది జూన్లోగా ఈపీఎఫ్ కటింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థను తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చు.

విత్డ్ డ్రా చేసుకోవడం మరింత సులభతరం కానుంది. ఈ విషయంపై ఆర్బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ముందుకు వెళితే చందాదారులు ఇక డెబిట్ కార్డు ద్వారానే ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ఏటీఎం కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అసలు దరఖాస్తు చేసుకోవాలా.? లేదంటే ప్రభుత్వమే స్వయంగా పిఎఫ్ ఖాతా ఉన్న వారి చిరునామాకు ఏటీఎం కార్డును పంపిస్తుందా.? అన్నది తెలియాల్సి ఉంది. 2025లో మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా నిర్దిష్ట పిఎఫ్ అమౌంట్ ను ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈపీఎఫ్ఓ కస్టమర్లు తమ పిఎఫ్ డబ్బులు ఏటీఎం కార్డు ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని ఇటీవల లేబర్ సెక్రటరీ తెలిపారు. ఖాతాదారులు తమ ఖాతా నుండి 50 శాతం వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పీఎఫ్ ఖాతాకు వచ్చే ఏటీఎం కార్డు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.   ఈ కార్డు కూడా సాధారణ ఏటీఎం మాదిరిగానే ఉంటుందని, అలాగే పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులో ఇచ్చే ఏటీఎం కార్డు నుండి ఎలా అయితే డబ్బులు తీసుకుంటున్నారో అదే తరహాలో ఈ కార్డు ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు తమ ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఏడు నుంచి పది రోజులు సమయాన్ని ఇస్తోంది. ఈ క్రైమ్ పరిష్కరించిన తర్వాత డబ్బు ఖాతాలకు జమ చేస్తుంది. అయితే ఈ తరహా ఇబ్బందులకు ఏటీఎం కార్డు అందుబాటులోకి వస్తే పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్