మయన్మార్, థాయిలాండ్ లో సంభవించిన భూకంపం మరణ మృదంగానే సృష్టించింది. భూకంపం వల్ల ఎప్పటికీ వందలాదిమంది మృత్యువాత చెందారు. ఇప్పటి వరకు 300 మంది భూకంపం బారినపడి మృతి చెందినట్లు ఆయాదేశాలు వెల్లడించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే అనేక భవనాల శిథిలాల కింద శవాల దిబ్బలు ఉన్నట్టు చెబుతున్నారు. కాపాడండి అనే ఆర్తనాధాలతో మయన్మార్, థాయిలాండ్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షా భూకంపాల తీవ్రతతో ఈ రెండు దేశాలు ప్రజలు భయాందోళనతో అల్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వందలాదిమంది వేదన వర్ణనాతీతంగా ఉంది.
భూకంపంతో సంభవించిన నష్టం
మయన్మార్, థాయిలాండ్ లో సంభవించిన భూకంపం మరణ మృదంగానే సృష్టించింది. భూకంపం వల్ల ఎప్పటికీ వందలాదిమంది మృత్యువాత చెందారు. ఇప్పటి వరకు 300 మంది భూకంపం బారినపడి మృతి చెందినట్లు ఆయాదేశాలు వెల్లడించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే అనేక భవనాల శిథిలాల కింద శవాల దిబ్బలు ఉన్నట్టు చెబుతున్నారు. కాపాడండి అనే ఆర్తనాధాలతో మయన్మార్, థాయిలాండ్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షా భూకంపాల తీవ్రతతో ఈ రెండు దేశాలు ప్రజలు భయాందోళనతో అల్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వందలాదిమంది వేదన వర్ణనాతీతంగా ఉంది. ఒక్క మయన్మార్ లోనే 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మయన్మార్ లోని నేపిడాలో వేయి పడకల ఆసుపత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, వాళ్ళ చోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్ష భూకంపాలు దెబ్బకు థాయిలాండ్ అల్లకల్లోలం అయింది. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం కావడంతో శిధిలాల కింద వేలమంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంకాక్ లో భూ ప్రకంపనలతో ఒక భారీ భవంతి భయంతో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు వందమందికి పైగా గల్లంతయ్యారు. థాయిలాండ్ లోను పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విధ్వంసం సృష్టించిన భూకంపం
మయన్మార్, థాయిలాండ్ లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు. రెక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో మొదటిసారి భూకంపం వచ్చింది. మళ్లీ 12 నిమిషాలు వ్యవధిలో 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు తర్వాత మరో నాలుగు సార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్నే కాకుండా పురుగును ఉన్న థాయిలాండ్, చైనాలోనూ విధ్వంసం సృష్టించింది. థాయిలాండ్ లో 50 మందికి పైగా మరణించారని, వందలాదిమంది గాయపడినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భూ ప్రకంపనలు భారత్ వరకు విస్తరించాయి. కలకత్తా, ఇంపాల్లో భవనాలు కంపించాయి. భూకంపం నష్టం పై ప్రధాన నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వేలి బుచ్చారు. రెండు దేశాలకు ఎలాంటి సాయం అవసరమైన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో భారత విదేశాంగ శాఖ టచ్ లో ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్ లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని ఢాకా, చిట్టగ్యాంగ్ లో ప్రకంపనలు వచ్చాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు. బ్యాంకాక్ సబర్బన్ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్ లో ప్రజలంతా షాపింగ్ మాల్ లు ఖాళీ చేసి నగరం మధ్యలో ఉన్న పార్కులో పోగయ్యారు. భారతీయ పర్యాటకులు పెద్ద ఎత్తున ఉండే నగరం కావడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న పర్యాటకులు బంధువులు ఆందోళనలో మునిగిపోయారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం భారతీయులందరికీ ఇటువంటి ఇబ్బంది కలగలేదు.