గూగుల్ ఆండ్రాయిడ్ ఒక అధునాతన ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భూకంపాల సమయంలో మొబైల్ కు అలర్ట్ ఇచ్చి ఎలాంటి భద్రతలు తీసుకోవాలో ఈ ఫీచర్ తెలియజేస్తుంది. భూకంప విషయాన్ని ముందుగానే తెలియజేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే గూగుల్ దేనిని తీసుకువచ్చింది. గూగుల్ సకాలంలో, సహాయకరమైన భూకంప సమాచారాన్ని అందించే విధంగా ఆండ్రాయిడ్ యూజర్స్ ను ఇది అలర్ట్ చేస్తుంది. దీనివల్ల తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇష్టమైన వారిని సురక్షితంగా ఉంచేందుకు అవకాశం ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
గడచిన కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. కొన్నిచోట్ల భూకంప తీవ్రతతో అనేకమంది మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలోనే భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముందుగా భూకంపం వచ్చే విషయాన్ని తెలియజేస్తే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే గూగుల్ ఆండ్రాయిడ్ ఒక అధునాతన ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భూకంపాల సమయంలో మొబైల్ కు అలర్ట్ ఇచ్చి ఎలాంటి భద్రతలు తీసుకోవాలో ఈ ఫీచర్ తెలియజేస్తుంది. భూకంప విషయాన్ని ముందుగానే తెలియజేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే గూగుల్ దేనిని తీసుకువచ్చింది. గూగుల్ సకాలంలో, సహాయకరమైన భూకంప సమాచారాన్ని అందించే విధంగా ఆండ్రాయిడ్ యూజర్స్ ను ఇది అలర్ట్ చేస్తుంది. దీనివల్ల తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇష్టమైన వారిని సురక్షితంగా ఉంచేందుకు అవకాశం ఉంటుంది.
గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను గుర్తిస్తుంది. భూకంపాలు ప్రారంభమయ్యే ముందు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అలర్ట్ పంపిస్తుంది. షేక్ అలర్ట్ తో భాగస్వామ్యం చేసుకునే వారి సిస్టం అందించే హెచ్చరికలను ఇది యూజర్స్ కు పంపిస్తుంది. ఈ షేక్ అలర్ట్ భూకంప ప్రకంపాలను గుర్తించేందుకు 1675 భూకంప సెన్సార్ల నెట్వర్క్ ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా వచ్చిన డేటాతో భూకంపా స్థానం, పరిమాణాన్ని విశ్లేషిస్తుంది. దీనిలో వచ్చిన రిజల్ట్ ను shakeAlert తన సిస్టం నుంచి Android Earthquak Alerts System కి ఒక సిగ్నల్ పంపుతుంది. దీనివల్ల Android వినియోగదారులకు నేరుగా భూకంప అలర్ట్ వస్తుంది. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో కంపనాలను గ్రహించగల చిన్న ఆక్సిలేరో మీటర్లు ఉంటాయి. ఇవి భూకంపం సంభవించడాన్ని సూచించగలరని చెబుతున్నారు. భూకంప గుర్తింపు సర్ వరకు ఒక సంకేతం వెళ్తుంది. అది ప్రకంపన ఎక్కడ ఉందో చూపిస్తుంది. అక్కడ ఎర్త్ క్వేక్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి సర్వర్ అనేక ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న రెండు బిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లను మినీ సుష్మోమీటర్లుగా ఉపయోగించి సమాచారాన్ని అలెర్ట్ రూపంలో పంపిస్తుంది.
భూకంప తీవ్రత, వేగం అన్ని తెలుసుకుని ప్రభావిత ప్రాంతాల్లోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు పంపిస్తుంది. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ముందుగా Android ఫోను యాపిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో Settings Safty & Emergency సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. దీనిలో Earthquake Alerts ఆప్షన్ను టర్న్ ఆన్ చేయాలి. అయితే మీరు ఎలక్ట్ పొందాలంటే వైఫై లేదా డేటా ఆన్ లో ఉండాలి. ఇది కేవలం ఆండ్రాయిడ్ యోజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. భూకంపం గురించి యువ దర్శనం అప్రమత్తం చేయడానికి ఆండ్రాయిడ్ లో రెండు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. Be Aware, Take Action అనే రెండు రకాల అలర్ట్ వస్తాయి. 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలకు మాత్రమే ఈ అలర్ట్ వస్తాయి. మీకు వచ్చిన నోటిఫికేషన్ నొక్కితే మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇటువంటి అలర్ట్ వస్తే జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఈ సెట్టింగ్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొబైల్ ఉపయోగించకపోయినా భూకంపం వచ్చేముందు పెద్ద సౌండ్ తో స్క్రీన్ ఆన్ చేసి అలర్ట్ వస్తుంది. ఇటువంటి అలర్ట్ వచ్చిన వెంటనే అప్రమత్తం కావడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.