ఏపీలో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంతకాన్ని చేశారు. మంత్రి మండల కూడా డీఎస్సీ విడుదలకు ఆమోదముద్ర వేసింది.

డీఎస్సీ

dsc vacancies


ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంతకాన్ని చేశారు. మంత్రి మండల కూడా డీఎస్సీ విడుదలకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలు ఎన్నెన్ని ఉన్నాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉన్న ఖాళీలు వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. జూలై ఒకటో తేదీన షెడ్యూల్ విడుదల కానుంది. డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ లో 14,066 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టులకు సంబంధించి ఖాళీలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 543, విజయనగరం 583, విశాఖ 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమగోదావరి 1067, కృష్ణ 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు జిల్లాలో 2678 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. వీటితోపాటు రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన స్కూల్స్ లో 2,281 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆయా ఖాళీలను వచ్చే నెల ఒకటో తేదీన విడుదల చేయనున్న నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ భర్తీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుండడం పట్ల నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందంటూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీపైనే పెట్టడం ద్వారా నిరుద్యోగుల మనసును గెలుచుకున్నారంటూ పలువురు విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్