బెంగళూరులోని డిఆర్డిఓ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDO - GTRE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్తులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలను కూడా తాజా ప్రకటనలో పేర్కొంది. ఆ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రాడ్యుయేట్, డిప్లమో, ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో బీటెక్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ ఉత్తీర్ణత పొందిన వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరులోని డిఆర్డిఓ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDO - GTRE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్తులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలను కూడా తాజా ప్రకటనలో పేర్కొంది. ఆ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రాడ్యుయేట్, డిప్లమో, ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో బీటెక్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ ఉత్తీర్ణత పొందిన వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 150 ఖాళీలు ఉండగా.. ఇవన్నీ మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికం, సిఎస్, ఐటి, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, సివిల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ బిఈ, బీటెక్ తక్షమాన కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు 75 పోస్టులు, బీకాం, బీఎస్సీ, బిఎ, బీసీఏ, బీబీఏ కోర్సులు పూర్తిచేసిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ విభాగంలో 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిప్లమో అప్రెంటిస్ ట్రైనీస్ పోస్ట్లు 20 భర్తీ చేయనున్నారు. ఐటిఐ అప్రెంటిస్ ట్రైనిస్ 25 పోస్టులను కేటాయించారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది మే 8వ తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ అప్రెంటిస్ కు అభ్యర్థులకు నెలకు గ్రాడ్యుయేట్స్ కు రూ.9000, డిప్లమో అప్రెంటిస్ కు రూ.8 వేలు, ఐటిఐ అప్రెంటిస్ కు రూ.7 వేలు చెల్లించనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు పదో తరగతి మార్క్ షీట్ అండ్ సర్టిఫికెట్ తోపాటు ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, కుల సర్టిఫికెట్, పిడబ్ల్యుడి సర్టిఫికెట్, భారత ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్), ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (వర్తిస్తే), రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దరఖాస్తులను The Director, Gas Turbine Research Establishmemt Drdo, ministry defence, post box no 9302, cv ramana nagar, Bengaluru - 560093 అడ్రస్కు పంపించాలి.