ఏపీలో వరద బాధితులకు వెల్లువెత్తుతున్న విరాళాలు.. ముందుకు వస్తున్న దాతలు

ఆంధ్రప్రదేశ్ లో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల ప్రజలకు సహాయాన్ని అందించేందుకు దాతలు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి భారీగా విరాళాలను అందిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి వరద బాధితుల సహాయార్థం హెరిటేజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.

Pawan Kalyan and Mahesh Babu

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

ఆంధ్రప్రదేశ్ లో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల ప్రజలకు సహాయాన్ని అందించేందుకు దాతలు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి భారీగా విరాళాలను అందిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి వరద బాధితుల సహాయార్థం హెరిటేజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆయుష్ ఆసుపత్రి యాజమాన్యం సీఎం చంద్రబాబును కలిసి విజయవాడ ఎంపీ కేసీనేని శివనాద్ సమక్షంలో రూ.50 లక్షలు విరాళంగా అందించింది. అలాగే ప్రతిపక్ష వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కోటి రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాధితులకు తమ పార్టీ తరఫున అవసరమైన ఆహార పదార్థాలను పాల ప్యాకెట్లను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అలాగే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు వరద బాధితుల కోసం కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎందుకు సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలో అందించారు. టిడిపి మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఐదు లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కల్లం రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, కొమ్మారెడ్డి కిరణ్ రూ.10 లక్షలు చొప్పున చెక్కుల రూపంలో తమ విరాలాలను మంత్రి లోకేష్ కు అందించారు. ఏవి రమణారెడ్డి ఏడు లక్షలు, ఒంగోలుకు చెందిన మేదరమెట్ల సుబ్బయ్య లక్ష, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఐదు లక్షలు, మంగళగిరి కి చెందిన పి లక్ష్మీ వెంకటనారాయణమూర్తి యాదవ్ దంపతులు రూ.1.2  లక్షలు విరాళంగా అందించారు. 

ఆపన్న ఆస్తం అందించిన సినీ లోకం 

వరదలతో విలవిల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖుడు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుకు అందించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి ఛలో 50 లక్షలు చొప్పున సహాయాన్ని ప్రకటించారు. మహేష్ బాబు కూడా కోటి రూపాయలను సహాయంగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయలు చొప్పున ఆయన ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగ వంశీ కలిసి రెండు రాష్ట్రాలకు కలిపి 50 లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధిగా అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరితోపాటు హీరో సిద్దు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30 లక్షల సాయాన్ని ప్రకటించారు. హీరో విశ్వక్సేన్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ళ ఐదు లక్షల సాయాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వైజయంతి మూవీస్ 25,00,000 ప్రకటించగా నిర్మాత బన్నీ వాస్ హాయ్ చిత్రం వసూళ్లలో పాతిక శాతాన్ని ఏపీ వరద బాధితులకు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు సహాయనిధికి విరారాలను ప్రకటించిన సినీ ప్రముఖులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్