భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరా అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు డొమినికా ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా సమయంలో భారత్ డొమినికాకు అందించిన సహాయానికిగాను ఆదేశం ప్రధాన మోడీకి ఈ అవార్డును ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరా అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు డొమినికా ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా సమయంలో భారత్ డొమినికాకు అందించిన సహాయానికిగాను ఆదేశం ప్రధాన మోడీకి ఈ అవార్డును ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ - డొమినికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆ దేశం కొనియాడింది. దీనికి గుర్తుగా ప్రధాని మోదీకి ఈ అత్యున్నత జాతీయ అవార్డును అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీకి డొమినికా ప్రభుత్వం 'డొమినికా అవార్డు ఆఫ్ హానర్' అవార్డును ప్రధానం చేయనుంది. వచ్చే ఏడాది గయానాలోని జార్జ్ టౌన్ లో జరిగే ఇండియా - కరికొమ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును అందించనున్నారు.
2021లో ప్రధాన మోడీ డొమినికాకు 70 వేల డోసుల ఆస్ట్రాజనిక కోవిడ్ 19 వ్యాక్సిన్లను అందించారు. ఈ వ్యాక్సిన్ వల్ల తమ పొరుగు దేశాలకు అండగా నిలవగలిగామని, ప్రధాన మోడీ నేతృత్వంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగంలో భారత్ తమకు మద్దతు అందిస్తుందంటూ ఆదేశం ప్రకటించింది. భారత్ తమకు గొప్ప భాగస్వామి అని, అందుకే ఆ దేశ ప్రధాని తమ అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నామని డొమినికా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. డొమినికా ప్రభుత్వం అందజేయనున్న ఈ పురస్కారం పట్ల భారత విదేశాంగ శాఖ హర్షాన్ని వ్యక్తం చేసింది. గడిచిన కొన్నాళ్లుగా ప్రధాన మోడీ అనేక దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారంటూ పేర్కొంది. ఈ అవార్డు పట్ల అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిపుణులు కూడా సానుకూలతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మోడీ ఇతర దేశాలతో నెరపుతున్న సంబంధాలకు దీనిని ప్రతీకగా చెప్పవచ్చు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.