సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఎంతోమంది అనేక వ్యయప్రయాసలు పడుతుంటారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేసుకునే ఎంతోమంది అద్దె ఇళ్లలోనే తమ జీవితాన్ని ముగిస్తుంటారు. కొందరు మాత్రం కష్టమైనా నష్టమైనా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఇంటి కలను తీర్చుకుంటుంటారు. తీసుకున్న రుణాలను చెల్లించడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్ని నెలలపాటు రుణాలు చెల్లించాల్సి రావడం చాలామందికి ఇబ్బందిగా పరిణమిస్తుంది. అయితే అటువంటివారు కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా వేగంగానే తమ ఇంటి రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
హోమ్ లోన్
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఎంతోమంది అనేక వ్యయప్రయాసలు పడుతుంటారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేసుకునే ఎంతోమంది అద్దె ఇళ్లలోనే తమ జీవితాన్ని ముగిస్తుంటారు. కొందరు మాత్రం కష్టమైనా నష్టమైనా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఇంటి కలను తీర్చుకుంటుంటారు. తీసుకున్న రుణాలను చెల్లించడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్ని నెలలపాటు రుణాలు చెల్లించాల్సి రావడం చాలామందికి ఇబ్బందిగా పరిణమిస్తుంది. అయితే అటువంటివారు కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా వేగంగానే తమ ఇంటి రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి రుణం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ ఈఎంఐ కూడా చాలా ఎక్కువ నెలలపాటు చెల్లించాల్సిన పరిస్థితి రుణగ్రహీతపై ఉంటుంది. ఎక్కువ నెలలపాటు చెల్లించాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో ఇంటి రుణాన్ని ఎంత వేగంగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. త్వరగా లోన్ కట్టాలంటే కొన్ని మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
హోమ్ లోన్ వేగంగా పూర్తి చేయాలంటే ప్రీ పేమెంట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బోనస్ లేదా ఇతర మార్గాల ద్వారా మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు దానిని హోమ్ లోన్ ఫ్రీ పేమెంట్ కోసం ఉపయోగించుకోవడం ద్వారా కొంత ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఇది లోన్ అసలు మొత్తాన్ని భారీగా తగ్గిస్తుంది. ప్రీ పేమెంట్ కట్టడం వల్ల లోన్ వ్యవధి, ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఈఎంఐ పెంచడం వల్ల కూడా హోమ్ లోన్ టెన్షన్ తగ్గుతుంది. ప్యాకేజీ పెరిగిన లేదా మరో కంపెనీలో చేరి జీతం పెరిగిన మీరు ఈ ఈఎంఐ కొంచెం పెంచిన అతి తక్కువ సమయంలోనే రుణభారం తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ ఈఎంఐ తగ్గించే అవకాశం బ్యాంకుకు ఉందా లేదా అనేది తెలుసుకొని తగ్గించుకుంటే మంచిది. ఏటా చాలా బ్యాంకులు వాయిదాను సవరించే అవకాశాన్ని కల్పిస్తాయి. జీతం పెరిగినట్టు అయితే దీని సద్వినియోగం చేసుకొని హోమ్ లోన్ పూర్తిగా వేగంగా తీర్చుకునే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్ వడ్డీరేట్లు ఎప్పటికప్పుడు ఇతర బ్యాంకులో రేట్లతో పోల్చాలి. బ్యాంకు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నట్లయితే వడ్డీ రేటును తగ్గించడానికి ఆ బ్యాంకు వారితో మాట్లాడాలి. సదరు బ్యాంకు ఒప్పుకోకపోతే హోమ్ లోన్ పై తక్కువ వడ్డీని అందించే బ్యాంకుకు లోన్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. ఈ విషయంలో ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. చాలా వరకు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ విషయంపై అవగాహన లేక చాలామంది కొన్ని ఏళ్లపాటు ఇంటి రుణాలను చెల్లిస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఇంటి రుణాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్న విషయం పై అవగాహన లేక ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సలహాల కోసం ఆర్థిక నిపుణులను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరగడమే దీనికి సంకేతంగా చెబుతున్నారు.