మహాశివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఆరోజు ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి ఆయనను స్మరించడం వల్ల శాంతి, ప్రశాంతత పొందుతారని పండితులు చెబుతున్నారు. పవిత్రమైన రోజు రాత్రి వేళల్లో మనుషుల్లో సహజంగా శక్తులు పెరుగుతాయి. రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు మరిన్ని ప్రత్యేక శక్తులను పొందుతారని పండితులు చెబుతున్నారు. అందుకే అన్ని జీవుల కన్నా మనుషులు వేగంగా వృద్ధి చెందడంతో పాటు విస్తరిస్తారు. ఈ క్రమంలో వెన్నెముక నిటారుగా అవకాశాన్ని పొందుతారు.
ప్రతీకాత్మక చిత్రం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి అనగానే ఎక్కువమంది ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేసి తెల్లవారుజామున సముద్ర స్నానాలను ఆచరిస్తారు. అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండే వారికి, జాగరణ చేసేవారికి ఆనవాయితీగా వస్తున్న ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నారే తప్ప.. దీని వెనుక ఉన్న ఉద్దేశం తెలియదు. నేపథ్యంలోనే మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు.? జాగరణ ఎందుకు చేసుకుంటారు తెలుసుకుందాం.
మహాశివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఆరోజు ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి ఆయనను స్మరించడం వల్ల శాంతి, ప్రశాంతత పొందుతారని పండితులు చెబుతున్నారు. పవిత్రమైన రోజు రాత్రి వేళల్లో మనుషుల్లో సహజంగా శక్తులు పెరుగుతాయి. రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు మరిన్ని ప్రత్యేక శక్తులను పొందుతారని పండితులు చెబుతున్నారు. అందుకే అన్ని జీవుల కన్నా మనుషులు వేగంగా వృద్ధి చెందడంతో పాటు విస్తరిస్తారు. ఈ క్రమంలో వెన్నెముక నిటారుగా అవకాశాన్ని పొందుతారు. గరుడ, స్కంద, అగ్ని, పద్మ పురాణాల ప్రకారం శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వారంతా శివుడిని బిల్వపత్రాలతో పూజించాలి. రాత్రి సమయంలో జాగరణ చేయడం మోక్షాన్ని ప్రసాదిస్తాడని, నరక బాధలను తప్పిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. శివరాత్రి యోగ రాత్రి. ఆరోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, విశ్వం నుంచి వెలువడే కాస్మిక కిరణాలను మానవ వికాసానికి, మనిషి తనను తాను తెలుసుకోవడంతో పాటు ఆత్మసాక్షాత్కారానికి తోడ్పాటును అందిస్తాయి.
ఉపవాసానికి ఎంతో విశిష్టత..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండే ఉపవాసానికి, జాగరణకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ రోజు అందరూ ఉపవాసం ఉండాలని శాస్త్రం చెబుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, గర్భిణీలు, మందులు తీసుకునే వారికి శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసం తినకూడదు. మద్యం సేవించకూడదు. కొందరు ఉపవాసం చేస్తున్నామని ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. తల స్నానం చేసి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నానంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అంటే ఉప అనే పదానికి సమీపంగా అని.. వాసం అంటే దగ్గరగా అని అర్థం. దేవుడుపై మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపటమే ఉపవాసం. ఉపవాసం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో ప్రాణ శక్తితో ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. నీటిని తాగకుండా ఉపవాసం చేయాలని ఎవరు చెప్పలేదు. శరీరాన్ని కష్టపెట్టకుండా భగవంతుడిపై మనసును లగ్నం చేయడం కష్టమే. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తులను గ్రహించాలంటే వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలి. నిలబడాలి.
జాగరణ ప్రత్యేకత ఇదే..
శివరాత్రి రోజున జాగరణ చేస్తే మనుషుల్లోనే శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. సినిమాలు చూడడం, కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడం జాగరణ కాదు. దీంతో పుణ్యం మాట దేవుడు ఎరుగు. ఆ సమయంలో మాట్లాడే మాటల్లో ఏవైనా చెడు మాటలు ఉంటే పాపం వస్తుంది. శివరాత్రి రోజున, మరుసటి రోజున ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలి. ఆ తరువాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసే వారంతా తరువాత రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.