గడిచిన కొన్నాళ్లుగా ఉరుకులు, పరుగుల జీవితాలతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది మృత్యువాత చెందుతున్నారు. అనేక దేశాల్లో ప్రజలు ఆయుర్ధాం కూడా తగ్గిపోతోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల కొంత జీవన ప్రమాణం పెరిగింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధానంతో ఎక్కువ కాలంపాటు బతికేందుకు అవకాశం ఉంది. అటువంటి విధానాలను అనుసరిస్తూ అనేక దేశాలు ఎక్కువ ఆయుర్ధాయాన్ని కలిగి ముందుకు సాగుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొన్నాళ్లుగా ఉరుకులు, పరుగుల జీవితాలతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది మృత్యువాత చెందుతున్నారు. అనేక దేశాల్లో ప్రజలు ఆయుర్ధాం కూడా తగ్గిపోతోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల కొంత జీవన ప్రమాణం పెరిగింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధానంతో ఎక్కువ కాలంపాటు బతికేందుకు అవకాశం ఉంది. అటువంటి విధానాలను అనుసరిస్తూ అనేక దేశాలు ఎక్కువ ఆయుర్ధాయాన్ని కలిగి ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లకుపైబడి ఆయుర్ధాయంతో అనేక దేశాలు ప్రజలు అదరహో అనిపిస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రజల ఆయుర్ధాయం 80 ఏళ్లకుపైబడి ఉండడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, మానసిక ప్రశాంతత దోహదం చేస్తున్నాయి.
వీటి వల్లే ఆయా దేశాల్లోని ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. ఉరుకులు, పరుగులు జీవితంలో అనేక దేశాల్లోని ప్రజలు వీటిని కోల్పోతున్నారు. చిన్న వయసులోనే రోగాలు బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రజలు మాత్రం అందుకు మినహాయింపు ఉంది. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతతతోపాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ పొందుతూ సులభంగా 80 ఏళ్లకుపైబడి జీవిస్తున్నారు. ఇందుకు పోషకాహారం, సరైన నిద్ర, సామాజిక బాంధవ్యాలు, ధ్యానం, వ్యాయామం వంటివి దోహధం చేస్తున్నాయి. ఆయా దేశాల ప్రజలు వీటిని అనుసరిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. 80 ఏళ్లకుపైబడి ఆయుర్ధాయం కలిగిన ప్రజలతో కూడిన దేశాలను పరిశీలిస్తే.. మొనాకో 87 ఏళ్లు, హాంగ్‌కాంగ్ 85 ఏళ్లు, శాన్ మారినో 84 ఏళ్లు, జపాన్ 83 ఏళ్లు, దక్షిణ కొరియా 83 ఏళ్లు, స్పెయిన్ 83 ఏళ్లు, స్విట్జర్లాండ్ 83 ఏళ్లు, ఆస్ర్టేలియా 83 ఏళ్లు, ఇటలీ 83 ఏళ్లు, సింగపూర్ 83 ఏళ్లతో టాప్‌లో ఉన్నాయి. ఈ దేశాల్లోని ప్రజలు జీవన విధానమే దీనికి కారణంగా తెలుస్తోంది.