రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..? సరైన నిద్రలేకపోతే అనారోగ్యమే.!

పోషకాలతో కూడిన ఆహారం, సరైన నిద్ర.. ఈ రెండు ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యం. ఉరుకులు, పరుగులు జీవితంలో వీటిలో ఏది దూరమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశముంది. రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోవాలన్న దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మంచి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.

sleep

నిద్ర

పోషకాలతో కూడిన ఆహారం, సరైన నిద్ర.. ఈ రెండు ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యం. ఉరుకులు, పరుగులు జీవితంలో వీటిలో ఏది దూరమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశముంది. రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోవాలన్న దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మంచి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. ప్రతి ఒక్కరూ రోజుకు ఎంత సమయం నిద్రపోతున్నామన్న దానిపై ప్రశ్నించుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వేధించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అతి నిద్ర కూడా ఆరోగ్య సమస్యలకు హేతువుగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరముంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలు ప్రకారం నిద్రకు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వయసులు వారీగా ఎవరెవరు ఎంతెంత సమయం నిద్ర పోవాలన్న విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం నవజాత శిశువులు రోజుకు 11 గంటలు నుంచి 14 గంటలు వరకు నిద్ర పోవాలి. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పది నుంచి 13 గంటలు నిద్ర తప్పనిసరి. 14 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారులు ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలి. 18 నుంచి 60 ఏళ్లలోపు వాళ్లు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి. 60 ఏళ్లుపైబడిన వాళ్లు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర చేయాలి. ఆయా వయసులు వాళ్లు తాము ప్రతిరోజూ ఎంత సమయం నిద్రపోతున్నామన్న విషయాలను ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. కంటికి సరైన నిద్ర లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరింది. నిద్ర లేకపోతే తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం, జీర్ణక్రియలో ఇబ్బందులతోపాటు అలసటగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ స్పష్టం చేసింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్