వరద ప్రభావిత ప్రాంతాల్లో విజృంభిస్తున్న వ్యాధులు.. అల్లాడుతున్న ప్రజలు

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో అల్లాడుతున్నారు. వరదలు వలన పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రజలు అనేక రకాల వ్యాధులు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులకు పైగా ప్రజలు వరద నీటిలోనే ఉండాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.

Many areas are under flood water

వరద నీటిలో పలు ప్రాంతాలు

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో అల్లాడుతున్నారు. వరదలు వలన పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రజలు అనేక రకాల వ్యాధులు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులకు పైగా ప్రజలు వరద నీటిలోనే ఉండాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన మొబైల్ వైద్య శిబిరాలకు భారీ సంఖ్యలో వైరస్ పీడితులు వస్తున్నారు. వీరికి అవసరమైన వైద్య సేవలను ఆరోగ్యశాఖ అధికారులు అందిస్తున్నారు. ఈ శిబిరాలకు వస్తున్న వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు వంట సమస్యలతో వస్తున్నారు. గడిచిన 10 రోజుల్లో జలుబుతో బాధపడుతూ వైద్య శిబిరాలకు 10,700 మంది వచ్చి వైద్య సేవలను పొందారు. అలాగే దగ్గుతో 16 వేలమంది బాధపడుతున్నట్లు వైద్యుల లెక్కల్లో తేలింది.

వీరికి అవసరమైన మందులను వైద్య శిబిరాల్లో ఆరోగ్యశాఖ అధికారులు అందించారు. ఇప్పటివరకు సుమారు పదివేల మంది వరకు జ్వరం బారిన పడినట్లు, వారికి అవసరమైన మందులను అందించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజల్లో ఎక్కువ మందిని చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయి. రోజులు తరబడి నీటిలోనే ఉండాల్సి రావడంతో కాళ్లల్లో పొక్కులు, దద్దుర్లు, మంట, దురద వంటి సమస్యలు వేధిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ తరహా సమస్యలతో బాధపడుతున్న సుమారు 8,000 మందికి వైద్య సేవలను అందించారు. అలాగే రోజు నీటిలో నడవాల్సి రావడంతో చాలామందికి రాళ్లు గాజు పెంకులు వంటివి గుచ్చుకొని పలువురు గాయాల పాలయ్యారు. ఈ తరహా గాయాలతో 3200 మందికిపైగా బాధితులు వైద్య శిబిరాలకు వచ్చి వైద్య సేవలను పొందారు. అలాగే ముంపు ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బీపీ వన్ సమస్యలతో బాధపడుతున్న 14500 మందికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో ఇప్పటివరకు 1.47 లక్షల మంది రోగులకు వివిధ రకాల వైద్య సేవలను అందించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్