ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు మాట్లాడిన మాటలు తెలంగాణలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతిని అవమానించినట్లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాత దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు మాట్లాడిన మాటలు తెలంగాణలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతిని అవమానించినట్లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమావేశంలో డైరెక్టర్ దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువగా వస్తోందని తాను డైరెక్టర్ కు చెప్పినట్లు వెల్లడించారు. అదే ఆంధ్రాకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారని, ఇక్కడ తెల్ల కళ్ళు, మటన్ జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దిల్ రాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ కల్చర్ ను దిల్ రాజు అవమానించేలా మాట్లాడారంటూ పలువురు మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ సంప్రదాయాన్ని కించపరిచేలా మాట్లాడిన దిల్ రాజు క్షమాపణలు చెప్పాలి అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం దిల్ రాజుకు చేరడంతో ఆయన తాజాగా స్పందించారు. తాను నిజామాబాద్ సభలో మాట్లాడిన మాటలపై పలువురు బాధపడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాను నిజామాబాదు వాసినని, నిజామాబాద్ జిల్లాతో తనకు అనుబంధం ఉందన్నారు.
అందుకే ఈ సినిమా ఈవెంట్ ను ఇక్కడ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గతంలో ఫిదా సక్సెస్ మీట్ నిర్వహించానని ఆ తరువాత జిల్లాలో జరిగిన అతిపెద్ద సినిమా ఈవెంట్ ఇదేనని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ లో తాను మటన్, తెల్ల కళ్ళు గురించి మాట్లాడానని, అయితే తాను తెలంగాణను అవమానించ్చానంటూ మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరస్ చేస్తున్నారని తెలిసిందన్నారు. తన ఉద్దేశం అదే స్పీచ్ లో చివరలో చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. మన కల్చర్ అయిన దావత్ మిస్ అవుతున్నానని, సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల చేశాక మా తెలంగాణ కల్చర్ దావత్ చేసుకోవాలని ఉందని చెప్పినట్టు వివరించారు. మన కల్చర్ ను తాను అభిమానిస్తానని, నిజంగా ఆ మాట వల్ల బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. తన ఉద్దేశం మాత్రం అదికాదని, బాన్సువాడలోనే ఫిదా చిత్రాన్ని తిలకించామని స్పష్టం చేశారు. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిందన్నారు. బలగం చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించిందని, అన్ని రాజకీయ పార్టీలు బలగం చిత్రాన్ని అభినందించాయన్నారు. తెలంగాణ వాసిగా తాను ఎలా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తానని స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్న ఆ కొందరికి క్షమాపణలు చెబుతున్నానంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దిల్ రాజు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.