ఆర్థిక మాంసం కారణంగా అమెరికాలో కొలువుల కోతతో రెండేళ్లుగా కుదేలవుతున్న భారతీయులు ఇక్కడ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాకతో మరింత గడ్డు పరిస్థితులను భారతీయులు అమెరికాలో ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందలాది మందిని అమెరికా నుంచి భారత్కు యుద్ధ విమానాల్లో అమెరికా తరలించింది. అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీయుల్లో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుంది. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక ఆందోళనలో ఉన్నారు. అలా అని భారత రాలేక అల్లాడిపోతున్నారు. ధైర్యం చేసి ఎక్కడికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని మరి కొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు వేట మొదలు పెడుతున్న వారు ఇంకొందరు ఉన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఆర్థిక మాంసం కారణంగా అమెరికాలో కొలువుల కోతతో రెండేళ్లుగా కుదేలవుతున్న భారతీయులు ఇక్కడ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాకతో మరింత గడ్డు పరిస్థితులను భారతీయులు అమెరికాలో ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందలాది మందిని అమెరికా నుంచి భారత్కు యుద్ధ విమానాల్లో అమెరికా తరలించింది. అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీయుల్లో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుంది. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక ఆందోళనలో ఉన్నారు. అలా అని భారత రాలేక అల్లాడిపోతున్నారు. ధైర్యం చేసి ఎక్కడికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని మరి కొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు వేట మొదలు పెడుతున్న వారు ఇంకొందరు ఉన్నారు. అటువంటి వారికి కూడా మంచి అవకాశాల దొరక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక విద్యార్థి ఎమ్మెస్ చేయడానికి ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఒక కంపెనీలో ఉద్యోగంలో కూడా చేరాడు. అతడు నెల సంపాదన మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఆరు లక్షల రూపాయలకు పై మాటే. ఆర్థిక మాంతం కారణంగా గత ఏడాది అతడు ఉద్యోగం పోయింది.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్, బెంగుళూరు, గురుగావ్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పటిదాకా అతన్ని ఇంటర్వ్యూకు పిలిచిన వారి సంఖ్య కేవలం ఐదు లోపే. ఆ ఇంటర్వ్యూలకు వెళ్లిన ఉద్యోగం రాలేదు. నెలకు కనీసం లక్ష రూపాయలు ఇచ్చినా చాలంటున్న తనకు ఉద్యోగం ఇచ్చే వారే కురువయ్యారని అతడు ఆపోతున్నాడు. ఇలాంటి వాళ్లు ప్రస్తుతం దేశంలో చాలామంది ఉన్నారు. అమెరికాలో ఎమ్మెస్ చేసిన దగ్గర కంపెనీలో ఉద్యోగాలు చేసినామన్న అనుభవం ఉన్న ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురువాపోతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వందలాదిమంది రెడిట్, లింకిడిన్ ఇలాంటి వెబ్సైట్లో ఏకరువు పెడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇండియాస్ గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం దేశంలోని పట్టభద్రులు కేవలం 42.6% మంది మాత్రమే ఉద్యోగ అర్హత కలిగి ఉన్నారు. అంటే డిగ్రీతోపాటు ఆ ఉద్యోగానికి కావలసిన అన్ని నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఏఐ, డేటా ఎనాలటిక్స్ వంటి అంశాల్లో నైపుణ్యం సంపాదించిన వారికి ఇప్పుడు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ వాటిని కలిగి ఉన్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీనికి తోడు సమస్యలను నేర్పుగా పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత వంటి విషయాల్లో కూడా మనవాళ్లు వెనుకబడి ఉంటున్నారని హెచ్ఆర్ మేనేజర్లు చెబుతున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలోనూ ఈ నైపుణ్యాల కొరత ఉంటుందని, వారికి అధిక జీతాలు ఇచ్చే బదులు ఇక్కడే ఔత్సాహకులకు 50 శాతం జీతం ఇచ్చే తగిన శిక్షణ ఇస్తే వారితో సమర్థంగా పనిచేయించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చేవారు భారతీయ కంపెనీలకు ఏం కావాలో అర్థం చేసుకోవాలని, తమ పని చేయాలనుకుంటున్నారంగం గురించి కొంత పరిశోధన చేస్తే తమకు ఉన్న అవకాశాలు తమ నైపుణ్యం అనుభవానికి తగిన ఉద్యోగం లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. దురదృష్టవశాత్తు చాలామంది ఇవేవీ చేయడం లేదని పేర్కొన్నారు. అందుకే వారికి ఉద్యోగం లభించడం కాస్త కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. ఏది ఏమైనా భారీ వేతనాలతో అమెరికాలో ఉన్నత స్థాయిలో ఇన్నాళ్లు నిలిచిన ఎంతోమంది విద్యార్థులకు ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా మారడం ఇబ్బందికరంగా మారుతుంది.