ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఇబ్బందులు.. క్లిష్టతరంగా అండర్ వాటర్ ఆపరేషన్

కొద్దిరోజుల కిందట తీవ్ర వరదలతో ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి ఇరుక్కున్న బోట్లను తొలగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులుగా బోట్లు తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు ఏవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. వీటిని బయటకు తీసేందుకు ఇప్పటికీ సిబ్బంది తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. రోజురోజుకు ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది. పైకి కనిపిస్తున్న రెండు బోట్లలో ఒక బోటు ఆయినా ముక్కలు చేయాలని సి లయన్ కంపెనీ, బెకం కంపెనీ ఇంజనీర్లు భావించారు.

Crew unloading boats

బోట్లను తొలగిస్తున్న సిబ్బంది

కొద్దిరోజుల కిందట తీవ్ర వరదలతో ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి ఇరుక్కున్న బోట్లను తొలగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులుగా బోట్లు తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు ఏవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. వీటిని బయటకు తీసేందుకు ఇప్పటికీ సిబ్బంది తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. రోజురోజుకు ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది. పైకి కనిపిస్తున్న రెండు బోట్లలో ఒక బోటు ఆయినా ముక్కలు చేయాలని సి లయన్ కంపెనీ, బెకం కంపెనీ ఇంజనీర్లు భావించారు. కానీ, ఇది సాధ్యం కాలేదు. నీళ్లలో బోటు కటింగ్ కు ఎక్కువ సమయం పడుతోంది. గురువారం ఉదయం బోటు పైభాగాన్ని కట్ చేశారు. ఈ బోట్ల తయారీకి బాగా మందంగా ఉన్న ఇనుప రేకును ఉపయోగించారు. తొమ్మిది మీటర్ల మేర రెండు వరుసల్లో కలిపి 18 మీటర్ల రేకును కట్ చేయాలి. నీటిలో మునిగి ఉన్న వైపు భాగాన్ని కూడా కలుపుకుంటే మరింత ఎక్కువే కట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న భాగం కటింగ్ పూర్తయింది. నీళ్లలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం కష్టంగా మారింది. డైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నారు. ప్రస్తుతం నీటి అడుగు భాగం నుంచి కటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో బోటును రెండు ముక్కల చేయాలన్న నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి అటు నదికి ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ వైపు నుంచి ఐరన్ రోప్ లు ఏర్పాటు చేసి ఆ రెండు ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు.

దీనికోసం కాకినాడ నుంచి పది మందితో కూడిన రిగ్గింగ్ టీం విజయవాడకు చేరుకున్నారు. పాపి కొండల్లో కచ్చులూరు వద్ద బోటు నీట మునిగినప్పుడు కీలకంగా పనిచేసిన అబ్బులు టీమ్ ఇక్కడకు చేరుకుంది. నీళ్లలోని బోట్లను లాగడంలో ఈ బృందానికి మంచి నైపుణ్యం ఉంది. మోడల్ గెస్ట్ వద్ద గల ఘాట్ పై భారీ రోప్ ను ఏర్పాటు చేసి ముక్కలైన బోటు భాగాన్ని లాగుతారు. ఈ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మొదలుకానుంది. ఒక్క బోటు కటింగ్ కు రెండు రోజుల సమయం పట్టింది. బ్యారేజీ వద్ద మొత్తం మూడు బోట్లు ఉన్నందున వారం రోజులు వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోట్ల వెలికితీత ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తొలగింపు ప్రక్రియలో భాగమైన సిబ్బందికి అవసరమైన వనరులను సమకూర్చే పనిని మంత్రి దగ్గరుండి చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బొట్ల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఈ బోట్లు వైసీపీకి చెందినవిగా టిడిపి చెబుతుంటే, కూటమి విజయానంతరం ఇదే బోట్లలో టిడిపి నాయకులు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు అంటూ వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ బోట్ల యజమానులుగా భావిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. ఈ బోట్లు ప్రకాశం బ్యారేజీ వరకు రావడానికి వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. దీని వెనక కుట్ర కోణం ఉంది అన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్