గడిచిన ఏడాది కోట్లాది రూపాయలను దానం చేయడం ద్వారా అపర ధాన కర్ణుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త, ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ నాడార్. భారత దాతల జాబితాలో మరోసారి ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఎడిల్ గివ్ - హురూన్ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ -2024 ప్రకారం.. గడచిన ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ మొత్తం రూ.2,153 కోట్ల విరాళాలను అందించారు. అంటే రోజుకు సగటున రూ.5.9 కోట్లు దానం చేశారు. శివ నాడార్ ఫౌండేషన్ సంస్థల ద్వారా నాడర్, ఆయన కుటుంబం విద్య, సాంకేతిక సంబంధిత కార్యక్రమాలకు ఈ సాయాన్ని వెచ్చించారు.
హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ నాడార్
పురాణాల్లో మనకు తెలిసిన అతి గొప్ప ధాన గుణం కలిగిన వ్యక్తి కర్ణుడు. ఆధునిక యుగంలో ఎంతోమంది వ్యాపార దిగ్గజాలు తమకున్న సంపదలో కొంత దానం చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. భారత్లోనూ అటువంటి ధాన కర్ణులు ఎందరో ఉన్నారు. దేశం కోసం కోట్లాది రూపాయలు దానం చేసే వ్యక్తిగా అందరూ రతన్ టాటా గురించి చెప్పుకుంటారు. ఆయన ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు అందించారు. అటువంటి మరికొంతమంది దాతృత్వం కలిగిన దానకర్ణులు ఉన్నారు. గడిచిన ఏడాది కోట్లాది రూపాయలను దానం చేయడం ద్వారా అపర ధాన కర్ణుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త, ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ నాడార్. భారత దాతల జాబితాలో మరోసారి ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఎడిల్ గివ్ - హురూన్ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ -2024 ప్రకారం.. గడచిన ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ మొత్తం రూ.2,153 కోట్ల విరాళాలను అందించారు. అంటే రోజుకు సగటున రూ.5.9 కోట్లు దానం చేశారు. శివ నాడార్ ఫౌండేషన్ సంస్థల ద్వారా నాడర్, ఆయన కుటుంబం విద్య, సాంకేతిక సంబంధిత కార్యక్రమాలకు ఈ సాయాన్ని వెచ్చించారు. ఈ జాబితాలో గడిచిన ఐదేళ్లలో శివనాడా మూడోసారి అగ్రస్థానంలో నిలిచారు. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.407 కోట్ల విరాళాలను అందించింది. దీంతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూ.352 కోట్ల విరాళాలతో బజాజ్ కుటుంబం మూడో స్థానంలో, రూ.334 కోట్ల విరాళాలతో ఆదిత్య బిర్లా గ్రూప్ నాలుగో స్థానంలో, రూ.330 కోట్ల విరాళాలతో అదానే గ్రూప్ అధిపతి గౌతమ్ అదాని 5వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.
ఇన్ఫోసిస్ సహాయ వ్యవస్థాపకులు నందన్ నీలేకని రూ.307 దానం చేయడం ద్వారా ఆరో స్థానంలో నిలిచారు. తెలుగు తేజం కృష్ణ చివుకుల రూ.228 కోట్ల దానంతో ఏడో స్థానంలో, వేదాంత గ్రూప్ అధిపతి అనిల్ అగర్వాల్ రూ.181 కోట్ల దానంతో ఎనిమిదో స్థానంలో, సుస్మిత, సుబ్రతో బాగ్చి రూ.179 కోట్ల దానంతో తొమ్మిదో స్థానంలో, రోహిణి నీలేఖని రూ.154 కోట్ల దానంతో పదో స్థానంలో నిలిచారు. దేశంలోని మహిళా దాతల్లో రోహిణి నీలేఖని అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ.90 కోట్ల దానంతో సుస్మిత బాగీచి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా రూ.85 కోట్ల దానంతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ దాతలు జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది చోటు దక్కించుకున్నారు. పీవీ కృష్ణారెడ్డి రూ.33 కోట్ల దానంతో 40, రూ. 32 కోట్ల దానంతో పి పిచ్చిరెడ్డి 41 వ స్థానంలో, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ.18 కోట్ల దానంతో 62వ స్థానంలో, దివిస్ ల్యాబ్స్ అధినేత మురళి కే దివి రూ.17 కోట్ల దానంతో 69వ స్థానంలో, అరబిందో ఫార్మా అధినేత పివి రాంప్రసాద్ రెడ్డి రూ.15 కోట్ల దానంతో 78వ స్థానంలో, హెట్రో ల్యాబ్స్ అధినేత బి పార్థసారధి రెడ్డి రూ.10 కోట్ల దానంతో 113 వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ సంస్థ జీవి ప్రసాద్ ఏడు కోట్లు దానంతో 142వ స్థానంలో, డాక్టర్ రెడ్డి సంస్థకు చెందిన కె సతీష్ రెడ్డి ఏడు కోట్ల దానంతో రూ.145వ స్థానంలో నిలిచారు.