టాటాకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఎయిరిండియాకు రూ.30 లక్షల ఫైన్..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఎయిరిండియా ఫ్లైట్‌లో ఒక మహిళపై నిందితుడు శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేసిన ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయ్యారని విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్‌కు రూ.3 లక్షల జరిమానా వేసింది. గత ఏడాది నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలోని బిజినెస్ క్లాసులో మూత్ర విసర్జన ఘటన చోటుచేసుకుంది. అటు.. నిందితుడు శంకర్ మిశ్రా నాలుగు నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించింది.


డీజీసీఏ ఉత్తర్వులపై ఎయిరిండియా స్పందించింది. జరిమానా ఉత్తర్వులు తమకు అందాయని, దాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. లోపాలను సరిదిద్దుకునేందు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. కొందరు ప్రయాణికుల వల్ల కలిగే అసౌకర్యాలను డీల్ చేసే విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియాను టాటా కంపెనీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్