కుంభమేళాకు తొలిరోజే పోటెత్తిన భక్తులు.. జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజే భక్తులతో త్రివేణి సంగమం కిటకిటలాడింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలివచ్చారు. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజులు పాటు ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ భారీగా ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన మహా కుంభమేళాకు ఉదయం నుంచే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

Crowd of devotees on the first day of Kumbh M

కుంభమేళాలో తొలిరోజు భక్తుల సందడి

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజే భక్తులతో త్రివేణి సంగమం కిటకిటలాడింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలివచ్చారు. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజులు పాటు ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ భారీగా ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన మహా కుంభమేళాకు ఉదయం నుంచే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం వద్ద ఉదయం భక్తులు పుణ్యస్నానాలతో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఏడాది కుంభమేళాకు 400 మిలియన్లకు పైగా ప్రజలు హాజరవుతారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ద్వారా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్య స్నానాలను ఆచరించారు. గంగా, యమునా, సరస్వతిల త్రివేణి సంగమం వద్ద సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు స్నానం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లాలని భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అందుకు అనుగుణంగానే కోట్లాదిమంది భక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తొలిరోజు స్నానాలను ఆచరించేందుకు  దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో మహా కుంభమేళా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. 

ప్రయాగ రాజ్ కు తరలి వచ్చిన భక్తులు ఏర్పాట్లు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాటుచేసిన ఏర్పాట్లు బాగున్నట్లు పేర్కొన్నారు. ఆహారంతోపాటు షెల్టర్ కోసం వసతి కల్పించారు. ఇక్కడికి చేరుకోవడానికి కూడా రోడ్లు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు. దేశంలోని ప్రతి పవిత్ర యాత్రలను తాను పాల్గొంటానని ఒక భక్తుడు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో పాలుపంచుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని ఉత్తర ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. భక్తులను రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలతోపాటు ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఏది ఏమైనా తొలి రోజే కుంభమేళా అట్టహాసంగా ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్