మహారాష్ట్రలో అద్భుత విజయాన్ని దక్కించుకున్న మహాయుతి కూటమిలో సీఎం ఎవరు ఉండాలన్న దానిపై గడిచిన నాలుగు రోజులుగా తర్జన, భర్జన కొనసాగుతోంది. దీనిపై గురువారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా మహారాష్ట్రకు చెందిన నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయం లో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాజా ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా తో సమావేశమైన మహారాష్ట్ర నేతలు
మహారాష్ట్రలో అద్భుత విజయాన్ని దక్కించుకున్న మహాయుతి కూటమిలో సీఎం ఎవరు ఉండాలన్న దానిపై గడిచిన నాలుగు రోజులుగా తర్జన, భర్జన కొనసాగుతోంది. దీనిపై గురువారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా మహారాష్ట్రకు చెందిన నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయం లో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాజా ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఖరారు అయింది. గురువారం అర్ధరాత్రి దాటినంత కేంద్ర మంత్రి అమిత్ షా మహారాష్ట్రకు చెందిన కీలక నేతలు ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవర్ సహా ఇతర నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవుల కేటాయింపులు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఇందులో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎంగా ఫడ్నవిస్ పేరు ఖరారు చేయడంతోపాటు మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలని దానిపైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమిత్ షా సూచనలకు అనుగుణంగా ముంబైలో మహాకూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మహారాష్ట్రకు చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. అమిత్ షా సూచనలపై చర్చించనున్నారు. రెండు రోజుల్లో మహారాష్ట్రకు పరిశీలకులు వచ్చి ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
తాజాగా అమిత్ షాతో జరిగిన సమావేశంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కీలక నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గతంలో మహారాష్ట్రకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోనట్లు తెలుస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే కొన్ని కీలక డిమాండ్లను ఈ సందర్భంగా అమిత్ షా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో స్పీకర్ పదవితోపాటు 12 మంత్స్ పదవులను కోరినట్లు చెబుతున్నారు. హోం శాఖ, పట్టణాభివృద్ధి సహా ముఖ్యమైన శాఖలను ఆయన కోరినట్లు రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. హోం మంత్రిత్వ శాఖ అప్పగించినప్పటికీ తగిన గౌరవాన్ని కొనసాగించాలని ఆయన కోరిన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలిసింది. 21, 12, 10 ఫార్ములాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బిజెపికి గరిష్టంగా 20 నుంచి 25 మంత్రి పదవులు, శివసేనకు పది నుంచి 12, ఎన్సీపీకి ఏడు నుంచి తొమ్మిది మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక చర్చలు మాత్రమే. ఇంకా పూర్తిస్థాయి చర్చలు శుక్రవారం జరగనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా ప్రభుత్వ ఏర్పాట్లు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మంత్రివర్గంలో సీనియర్ నేతలకు అవకాశం దక్కకపోవచ్చునే పార్టీ నేతలు చెబుతున్నారు. యువ నాయకులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవచ్చు అని బిజెపికి చెందిన ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.