నేడు పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మినీ గోకులం ప్రారంభం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనకు వెళ్లనన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడిపి రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు.

Deputy CM Pawan Kalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనకు వెళ్లనన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడిపి రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో పలుచోట్ల రహదారి గుంతలను ఆయన పరిశీలించనున్నారు. అలాగే ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మార్గాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం 11.45 గంటలకు పిఠాపురం మండలం కుమారపురానికి వెళ్తారు. ఇక్కడ ఉపాధి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు.

12:45 గంటలకు పిఠాపురం పాత బస్టాండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సభ అనంతరం 3.30 గంటలకు బయలుదేరి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికీ అధికారులు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, వీడి శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పిఠాపురం మండలం మల్లాలంలోని గోకులం, విరవాడ, చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలను, పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడ మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రారంభోత్సవాల అనంతరం పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్