ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఢిల్లీకి జరిగిన గడిచిన మూడు ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందా.? బిజెపి బాగా వేస్తుందా.? కాంగ్రెస్ మరోసారి పూర్వ వైభవం దిసుగా అడుగులు వేస్తుందా అన్న చర్చ సర్వత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఢిల్లీకి జరిగిన గడిచిన మూడు ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందా.? బిజెపి బాగా వేస్తుందా.? కాంగ్రెస్ మరోసారి పూర్వ వైభవం దిసుగా అడుగులు వేస్తుందా అన్న చర్చ సర్వత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తంగా 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాటికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఒక ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఢిల్లీ కాంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ స్థానంలో అత్యలకు సంఖ్యలో ఓటర్లు ఉండడమే దీనికి కారణం. ఈ నియోజకవర్గంలో దాదాపు 78,000 మంది ఓటర్లు ఉండగా, 59.36 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరగా వికాస్పురి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ అత్యధికంగా 4.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం ఫలితాలు ఆలస్యం అవుతాయని పలువురు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు పోటీ చేశారు.