వంద కోట్లకు పరువు నష్టం దావా.. ఆ మీడియా సంస్థలకు జగన్‌ వార్నింగ్‌

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కొన్ని మీడియా సంస్థలకు స్ర్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తనపై ఇష్టానుసారంగా వార్త కథనాలు ప్రసారం చేస్తున్న ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది మూర్ఖపు ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.

Ys Jaganmohan Reddy

 వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కొన్ని మీడియా సంస్థలకు స్ర్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తనపై ఇష్టానుసారంగా వార్త కథనాలు ప్రసారం చేస్తున్న ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. గురువారం సాయత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది మూర్ఖపు ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. కొందరు కావాలనే చేస్తున్న రాద్ధాంతమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్‌. తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్‌ విస్తున్నానని స్పష్టం చేశారు. సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారని, తాను ఐదేళ్ల కాలంలో అదానీని అలానే కలిశానన్నారు. విద్యుత్‌ ఒప్పందాలకు ముడిపెట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలని, వాస్తవాలను విక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో తన పేరు ఎక్కడా లేదని, కానీ, ఈ రెండు మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆయా సంస్థలకు లీగల్‌ నోటీసులు పంపిస్తానని, 48 గంటలు గడువు ఇస్తున్నానని, ఈలోగా క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు జగన్మోహన్‌రెడ్డి. 

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హామీలను అమలు చేయకపోయినా పెద్ద ఎత్తున స్కామ్‌లు చేస్తోందని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో స్కామ్‌లు పాలన సాగుతోందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. లిక్కర్‌, ఇసుక స్కామ్‌లతోపాటు ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, రెడ్‌బుక్‌ పాలన సాగుతోందన్నారు. ప్రతిచోట దోపిడీ, మాఫియా సామ్రాజ్యం పెచ్చుమీరుతున్నాయన్నారు. పైస్థాయి నుంచి కింది వరకు ఎక్కడికక్కడ కమిషన్లు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. తాను సంపద సృష్టిస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని మండిపడ్డారు. మంచి చేసిన వాళ్లపై రాళ్లు వేయడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నారు. చంద్రబాబు, ఆయన సోషల్‌ మీడియా తనపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్