రైల్వే ఉద్యోగాలకు మారిన రాత పరీక్ష తేదీలు.. పరీక్షలు నిర్వహించే కొత్త తేదీలు ఇవే.!

రైల్వేశాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దేశ వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అనేక పరీక్షలకు ఇప్పటికే రైల్వేశాఖ అధికారులు పరీక్షలు తేదీలను విడుదల చేశారు. అయితే, కొన్ని కారణాలు వల్ల ఆయా తేదీల్లో మార్పులు చోటుచేసుకన్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అధికారులు మారిన పరీక్షలకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. తాజా ప్రకటన ప్రకారం ఆర్‌పీఎఫ్‌ ఎస్సై టెక్నీషియన్‌, జేఈ రాత పరీక్షలు కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.

New Schedule for Railway Written Exams

రైల్వే రాత పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ 

రైల్వేశాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దేశ వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అనేక పరీక్షలకు ఇప్పటికే రైల్వేశాఖ అధికారులు పరీక్షలు తేదీలను విడుదల చేశారు. అయితే, కొన్ని కారణాలు వల్ల ఆయా తేదీల్లో మార్పులు చోటుచేసుకన్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అధికారులు మారిన పరీక్షలకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. తాజా ప్రకటన ప్రకారం ఆర్‌పీఎఫ్‌ ఎస్సై టెక్నీషియన్‌, జేఈ రాత పరీక్షలు కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జరగనున్నాయి. పరీక్షలకు పది రోజులు ముందు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష జరిగే నగరం పేరు, తేదీ వివరాలను వెల్లడించనున్నారు. నాలుగు రోజులు ముందుగా అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మేరకు రైల్వేశాఖ స్పష్టం చేసింది. 

మారిన పరీక్షలు తేదీలు ఇవే

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్‌ లోకో పైలెట్‌(సీబీటీ-1) పోస్టులకు రాత పరీక్షలు నవంబరు 25 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు డిసెంబరు రెండో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. టెక్నీషియన్‌ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబరు 18 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 18,799 లోకో పైలెట్‌ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులు, 14,298 టెక్నీషియన్‌ పోస్టులు, 7951 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 41,500 ఖాళీలు భర్తీకి రైల్వేశాఖ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్‌టీపీసీ, పారా మెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షలు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. వీరికి రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్